Anupama: ఆ హీరోతో లిప్ లాక్ వద్దని.. ఇప్పుడు ఈ హీరోతో..!

క్యూట్ గా కనిపించే అనుపమ పరమేశ్వరన్ ఇప్పటివరకు రొమాంటిక్ సీన్స్ లో పెద్దగా రెచ్చిపోయిన సందర్భాలు లేవు. కేవలం తక్కువ లిమిట్స్ లోనే ఈ బ్యూటీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్స్ లిప్ లాక్ సీన్స్ అలాగే గ్లామర్ తో ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే అలా ఏవి లేకుండానే అనుపమ కుర్రాళ్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ బ్యూటీ మొదటిసారి ఒక లిప్ లాక్ సన్నివేశంలో నటించే సరికి సోషల్ మీడియాలో అభిమానుల నుంచి కూడా విభిన్నంగా టాక్స్ వస్తున్నాయి.

రౌడీ బాయ్స్ సినిమా తో పరిచయమవుతున్న దిల్ రాజు బ్రదర్ శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డి తో కలిసి పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక మొదటిసారి ఈ హీరోతోనే లిప్ లాక్ సీన్ లో నటించింది. అనుపమ పరమేశ్వరన్ కు గతంలో చాలా పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక అందులో కొన్ని ఆఫర్స్ ను రొమాన్స్ ఎక్కువైందని రిజెక్ట్ కూడా చేసింది. ఎన్నడూ కూడా లిప్ లాక్ సన్నివేశాలకు ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

కానీ ఇప్పుడు మాత్రం దిల్రాజు ప్రొడక్షన్ లో వస్తున్న వారసుడు సినిమాలో లిప్ లాక్ సన్నివేశం లో చాలా ఘాటుగా కనిపించింది. ఏదో నామమాత్రంగా హీరో పెదాలపై ముద్దు అని కాకుండా ఇంగ్లీష్ సినిమా తరహాలో రెచ్చిపోయింది. సినిమాకు సంబంధించిన ట్రైలర్ లో అదే సన్నివేశం హైలెట్గా నిలవడంతో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. సినిమాపై ప్రస్తుతం అయితే పెద్దగా బజ్ క్రెడిట్ కాలేదు. కానీ అలాంటి హీరోయిన్ ఇలాంటి సన్నివేశంలో నటించింది అంటే తప్పకుండా ఓ వర్గం వారు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తారు అని చెప్పవచ్చు.

జనవరి 14న విడుదల కాబోతున్న రౌడీ బాయ్ సినిమాకు శ్రీ హర్ష దర్శకత్వం వహించాడు. గతంలో ఉషారు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హర్ష ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus