Anushka: మరోసారి హీరోయిక్‌ పాత్రలో అనుష్క.. పాత్ర ఎలా ఉంటుందో?

Advertisement

హీరోయిన్లలో సూపర్‌ స్టార్‌ అంటూ ఎవరెవరో పేర్లు ఇప్పుడు చెబుతున్నారు కానీ.. విజయశాంతి (Vijayashanti) తర్వాత ఆ స్థాయిలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు, హీరోయిక్‌ టచ్‌ ఉన్న పాత్రలు చేసింది మాత్రం అనుష్క (Anushka) నే అని చెప్పాలి. వివిధ కారణాల వల్ల ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంది. ఒకవేళ చేసినా సెలక్టెడ్‌ పాత్రలే ఎంచుకుంటోంది కానీ.. ఆమె మనసు పెట్టి సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోలకు సమానంగా పాత్రలు చేయగలదు. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు అనుకుంటున్నారా?

Anushka

ఎందుకంటే, అనుష్క (Anushka)  తిరిగి హీరోయిక్‌ ట్రాక్‌ ఎక్కబోతోంది అని కోలీవుడ్‌ సమాచారం. చేతిలో విజయాలున్నా, అవకాశాలు వరుస కడుతున్నా కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది అనుష్క (Anushka) . త్వరలో ‘ఘాటి’ (Ghaati) సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. జులై 11న సినిమాను రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఇది కాకుండా మలయాళంలో ‘కథనార్‌ – ది వైల్డ్‌ సోర్సెరర్‌’ అనే సినిమా కూడా ఉంది. ఇప్పుడు మరో సినిమాకు ఓకే చెప్పింది అని సమాచారం.

ఆ సినిమాను ఓకే చేయడం ద్వారా లోకేశ్‌ కనగరాజ్‌(Lokesh Kanagaraj)  సినిమాటిక్‌ యూనివర్స్‌లో అనుష్క భాగం కానున్నట్లు తెలుస్తోంది. ‘కూలి’ (Coolie) సినిమాతో బిజీగా ఉన్న లోకేశ్‌.. ఆ పనులు పూర్తయ్యాక ‘ఖైదీ 2’  సినిమా చేస్తారు. ఆయన దర్శకత్వంలోనే వచ్చి భారీ విజయం అందుకున్న ‘ఖైదీ’ సినిమాకి ఇది ప్రీక్వెల్‌. ఈ సినిమాలోనే ఓ పాత్రకు అనుష్కను లోకేశ్‌ టీమ్‌ సంప్రదించింది అని సమాచారం. ఈ పాత్ర హీరోయిక్‌గా ఉంటుందని, అనుష్క కెరీర్‌కి అసెట్‌గా ఉంటుంది అని కూడా చెబుతున్నారు.

ఒకవేళ ఈ పుకారు నిజమైతే కార్తితో అనుష్కకు ఇది రెండో సినిమా అవుతుంది. గతంలో ‘అలెక్స్‌ పాండియన్‌’ (Alex Pandian) సినిమాలో ఇద్దరూ జంటగా కనిపించారు. ఇక ‘ఖైదీ’  (Kaithi) ప్రీక్వెల్‌ సంగతి చూస్తే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబరు నుండి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news