టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా….ఎంతో మంది అందమైన హీరోయిన్స్ ఉన్నారు. అయితే అందులో కొందరు పెళ్లి అయిన వాళ్ళు…ఎక్కువ మంది యంగ్ భామలు. అయితే అదే క్రమంలో పెళ్లీడుకి వచ్చి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న భామలు సైతం చాలా మంది ఉన్నారు…అయితే అందులో మన అందాల భామ, అనుష్క షెట్టి ముందు వరుసలో ఉంటుంది…ఇప్పటికే 34వచ్చిన అనుష్క పెళ్లి పై…ఆమె కుటుంభం సంగతి ఏమో కానీ…అభిమానులు…ప్రేక్షకులు మాత్రం చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు….అందులో ముఖ్యంగా ఈ మధ్య ఆమె పెళ్లిపై రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతూ వస్తునాయి. తమిళ తంబీల మాటలు బట్టి చూస్తే…కోలీవుడ్ హీరో ఆర్యతో లవ్ స్టోరీ అని.. పెళ్లి చేసుకోబోతోందని అన్నారు. అదే క్రమంలో టాలీవుడ్ హీరోతో కూడా డేటింగ్ చేసిందని కూడా చెప్పారు.
ఓ వ్యాపారవేత్త కం ప్రొడ్యూసర్ తో అనుష్క మ్యారేజ్ ఖాయమైందని రీసెంట్ గా టాక్ వినిపించింది. అయితే ఇవన్నీ రూమర్స్ అని, అంతేకాకుండా స్వీటి పేరెంట్స్ కూడా ఆమె పెళ్లి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే….ప్రస్తుతం బాహుబలి2.. భాగమతి.. సింగం3.. ఓం నమో వెంకటేశాయ చిత్రాలలో నటిస్తోంది అనుష్క. ఇవన్నీ వచ్చే ఏడాది సమ్మర్ నాటికి వచ్చేస్తాయి. బాహుబలి2 రిలీజ్ తర్వాత అఫీషియల్ అనౌన్స్ మెంటే చేసేందుకు ఫ్యామిలీ మెంబర్స్ సిద్ధమవుతున్నాయనే రూమర్ గట్టిగానే వినిపిస్తోంది. హైద్రాబాద్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాగ్నెట్ తో స్వీటీ పెళ్లి ఫిక్స్ అయిందని.. ఆ సంగతులు బాహుబలి2 విడుదల తర్వాత వెల్లడవుతాయన్నది లేటెస్ట్ టాక్. మరి అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే…త్వరలోనే స్వీటి పప్పు అన్నం పెట్టేస్తుంది అన్న మాట.