ఆ సినిమా నేను చేయడం లేదంటున్న అనుష్క

జ్యోతిక రీఎంట్రీ ఇస్తూ నటించిన తాజా చిత్రం ‘నాచ్చియార్’. ఈ తమిళ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించడంతో తెలుగులోనూ డబ్బింగ్ చేద్దామనుకొన్నారు. అయితే.. డబ్బింగ్ చేయడం కంటే రీమేక్ చేయడం బెటర్ అని భావించి అనుష్క ప్రధాన పాత్రలో రీమేక్ చేద్దామనుకొన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.అయితే ‘నాచ్చియార్’’గా నటించేందుకు అనుష్క ఒప్పుకోలేదని తెలుస్తోంది. బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జ్యోతిక పవర్‌ఫుల్‌ పోలీసు అధికారి పాత్రలో నటించింది. ఒక సన్నివేశంలో ఆమె పోలీసు డ్రెస్‌లోనే బూతు డైలాగు చెప్పి.. పెను వివాదంలో చిక్కుకుంది.

ఈ కారణంగానే ‘నాచ్చియార్’లో నటించడానికి అనుష్క వెనకడుగు వేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. నిజానికి గత కొన్నేళ్లుగా అనుష్క హీరోయిన్‌ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటిస్తూ లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందుతోంది. ఇటీవల ‘భాగమతి’గా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలై, ఇరు రాష్ట్రాల ప్రేక్షకులను ఆశ్చర్యకితుల్ని చేసింది. అందుకే ‘నాచ్చియార్’ తెలుగు వెర్షన్‌‌లో అనుష్కతో నటించింపజేయాలని భావించారు. కానీ, జేజమ్మ నో చెప్పడంతో వారు నిరాశ చెందారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus