Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

టాలీవుడ్‌లో మరో ఫ్రెష్ కాంబినేషన్ తెరపైకి రానుందన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా , స్టైలిష్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మెగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. కొంతకాలంగా కథ, స్క్రీన్‌ప్లే పై సీరియస్‌గా వర్క్ చేసిన సురేందర్ రెడ్డి, ఇటీవల పవన్‌తో జరిగిన కీలక భేటీ తర్వాత స్క్రిప్ట్‌ను లాక్ చేసినట్లు సమాచారం.

Pawan Kalyan

ఈ సినిమాను పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించేందుకు టీమ్ ప్లాన్ చేస్తుండగా, పవన్ డేట్స్‌కు అనుగుణంగా షూటింగ్ షెడ్యూల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారట. ఇక హీరోయిన్ ఎంపిక విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొదట సోషల్ మీడియాలో వినిపించిన ఇమాన్వి పేరు పక్కనపెడితే, ఇప్పుడు యంగ్ బ్యూటీ సాక్షి వైద్య పేరు బలంగా వినిపిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఏజెంట్’ సినిమాలో మరియు రీసెంట్ హిట్ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ చిత్రాలలో ఆమె గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునేలా ఉండటంతో మళ్ళీ ఛాన్స్ ఇచ్చారని టాక్.

నిర్మాత రామ్ తాళ్లూరి ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఉగాది సందర్భంగా సినిమా టైటిల్, హీరోయిన్ ఫైనలైజేషన్‌తో పాటు టెక్నికల్ టీమ్ వివరాలను అధికారికంగా ప్రకటించటానికి సిద్ధం అవుతున్నారు మేకర్స్. పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ మోమెంట్స్, సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ కలయికలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదుచూస్తున్నారు.

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus