Anushka: ఫారెన్ లో అనుష్క.. పది రోజులపాటు అక్కడే!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. రీసెంట్ గా ఈ బ్యూటీ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం వెళ్లిందో.. లేక సినిమా షూటింగ్ వచ్చేలా ముందుగానే ప్లాన్ చేసుకుందో తెలియదు కానీ ఇప్పుడు ఆమె లండన్ లో ఉంది. అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా యూనిట్ లండన్ లో ఉంది.

ఈరోజు లేదంటే రేపు సినిమా కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. సుమారు పది రోజులు లండన్ లో షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. లండన్ సిటీతో పాటు శివార్లలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అనుష్క కెరీర్ లో 48వ సినిమా ఇది. లండన్ షెడ్యూల్ పూర్తయిన అనుష్కతో పాటు సినిమా టీమ్ హైదరాబాద్ కి రానుంది. ఇక్కడ మరో పదిహేను రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. దాంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తి కానుంది.

ఆ తరువాత ఒకటి లేదా రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయని.. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని ఆమె పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. సినిమాలో ఆమె అన్విత రవళి శెట్టి అనే పాత్రలో కనిపించనుంది. యూవీ క్రియేషన్స్ లో ఇదివరకు అనుష్క చాలా సినిమాలే చేసింది. ఆమె నటించిన ‘మిర్చి’, ‘భాగమతి’ వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

ఆ సినిమాల తరువాత అనుష్క నటిస్తోన్న హ్యాట్రిక్ సినిమా ఇది. త్వరలోనే సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus