అనుష్క గట్టిగా ఇచ్చింది.. అయినా ఆగుతాయా?

తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ అయిన అనుష్క.. సినిమా వచ్చి రెండు సంవత్సరాలు దాటింది. మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటించినప్పటికీ.. అది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే. ఇక ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న విడుదల కాబోతుంది. హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కోన ఫిలిం కార్పొరేషన్’ మరియు ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుష్క మూగ అమ్మాయిగా కనిపించబోతుంది. ఇది పక్కన పెడితే.. తాజాగా అనుష్క శివరాత్రి సందర్భంగా ఓ గుడికి వెళ్లింది.

దానికి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో అనుష్క.. శివలింగానికి అభిషేకం చేస్తూ కనిపిస్తుంది. ఇక గత కొంతకంగా అనుష్క ఓ క్రికెటర్ ను పెళ్లిచేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల పై అనుష్క స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ” నా విషయంలోనే ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. నేను నా తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. ఇలాంటి అసత్య ప్రచారం చేసేవాళ్ళు దయచేసి ఇక ఆపండి” అంటూ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ ఈమె స్టార్ హీరోయిన్ కదా.. రూమర్స్ ఆగుతాయా..? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus