Anushka, Kantara: అద్భుతమైన సినిమా.. ఎవరు మిస్ కావద్దు:అనుష్క

  • October 17, 2022 / 11:44 AM IST

కన్నడ హీరో రిషబ్ శెట్టి సంయుక్త గౌడ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కాంతారా. రిషబ్ శెట్టి దర్శకత్వంలోనే ఆయనే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు భాషలో అక్టోబర్ 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని కే జి ఎఫ్ సినిమాని నిర్మించిన హోం భలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో విడుదల చేశారు.

ఇక ఈ సినిమా విడుదలైన నాటి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కాంతారా సినిమా పేరు మాత్రమే వినపడుతుంది. ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కాంతారా సినిమాపై టాలీవుడ్ నటి అనుష్క శెట్టి స్పందించారు. ఈ సందర్భంగా ఈమె ఈ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సినిమాపై అనుష్క స్పందిస్తూ ఇప్పుడే తాను కాంతారా సినిమా చూశానని తెలిపారు.

సినిమా చాలా బాగుంది సినిమా కోసం పని చేసిన నటీనటులు నిర్మాతలు ఇతర టెక్నీషియన్లకు శుభాకాంక్షలు. ఇక హీరో రిషబ్ శెట్టి ఎంతో అద్భుతంగా నటించారు.ప్రతి ఒక్కరూ ఈ సినిమాని మిస్ కాకుండా థియేటర్ లోనే సినిమాను చూడండి అంటూ అనుష్క ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus