Brahmamudi September 5th: కావ్యతో చనువుగా ఉన్న రాజ్… సందేహ పడుతున్న అపర్ణ!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ ఇప్పటికే టాప్ రేటింగ్ లో కొనసాగుతుంది భర్త ప్రేమ కోసం ఆరాటపడుతున్నటువంటి ఓ భార్య కథ. మరి నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే… ఎపిసోడ్ ప్రారంభంలోనే సీతారామయ్య తన గదిలో నుంచి హాల్లోకి తీసుకు వెళ్ళమని చెప్పడంతో రాజ్ తనని హాల్లోకి తీసుకువస్తారు అయితే ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఇలా హాల్లో కూర్చోవడం ఏంటి కాసేపు రెస్టు తీసుకోవచ్చు కదా అంటూ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వస్తారు.

రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇప్పుడు నీకు ఇక్కడికి వచ్చారు అంటూ కుటుంబ సభ్యులు మాట్లాడటంతో పొద్దున జరగాల్సిన ఒక కార్యం ఆగిపోయింది ఆ కార్యం జరగకపోతే ఈరోజు కావ్య వ్రతం చేసిన కూడా అది అసంపూర్ణమవుతుంది వెళ్ళు నీ భార్యను తీసుకువచ్చి తనని ఆశీర్వదించు అని సీతారామయ్య చెప్పడంతో రాజ్ తప్పనిసరి పరిస్థితులలో తన గదికి వెళ్తాడు. అయితే అప్పటికే కావ్య లగేజ్ మొత్తం సర్ది ఉంటుంది రాజ్ ను చూసిన ఆమె ఇంకా వెళ్లలేదా అని అడగకండి మీరు వస్తే మీకు చెప్పి వెళ్దామని ఎదురు చూస్తున్నాను అని చెప్పడంతో రాజ్ మాత్రం ఇన్ని రోజులు ఎదురు చూసావు మరో మూడు నెలల పాటు ఓపికగా ఎదురు చూడు అంటూ మాట్లాడుతాడు.

మూడు నెలలలో మీ మనసు మారుతుందా లేదా నన్ను ఇలాగే నిరాశకు గురి చేస్తారా అంటూ కావ్య మాట్లాడుతుంది. ఈ మూడు నెలల పాటు ఓపికతో ఇక్కడే ఉండు అంటూ రాజ్ చెప్పడంతో కావ్య సంతోషపడుతుంది. ఇక రాజ్ తన చేతిని పట్టుకొని అందరూ చూస్తుండగానే తనని కిందికి తీసుకువెళ్తారు అలాగే తనపై అక్షింతలు వేసి కూడా ఆశీర్వదించడంతో కావ్య ఎంతో సంతోషపడుతుంది కానీ అపర్ణ మాత్రం చాలా షాక్ అవుతుంది. ఈరోజు నేను చేసిన ఈ వ్రతం ఈయన ఆశీర్వదించడంతో సంపూర్ణం అయింది తాతయ్య గారు ఎక్కడ ఈ వ్రతం మొత్తం అసంపూర్ణమౌతుందోనని బాధపడ్డాను ఇదంతా మీ వల్లే జరిగింది అంటూ కృతజ్ఞతలు తెలుపుతుంది.

అదే రోజు రాత్రి అపర్ణ ఆలోచిస్తూ ఉండగా రుద్రాణి అక్కడికి వెళ్లి ఆపర్ణను రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది. మహారాణి లాగా ఈ ఇంట్లో ఉంటే నీకు కోడలు వచ్చిన తర్వాత నీ మాటలు అసలు చెల్లడం లేదు అంటూ అపర్ణను రేచ్చగొట్టే విధంగా రుద్రాణి మాట్లాడుతుంది. నువ్వు ఎంత చెప్పినా నీ మాటలు లెక్క చేయకుండా నీ కొడుకు కావ్య వైపే వెళుతున్నాడు అంటూ రుద్రాన్ని మాట్లాడటంతో నా కొడుకు మరీ ఏమీ అంత అమాయకుడు కాదు తనకు ఎప్పుడు ఏం చేయాలో అన్ని తెలుసు అంటుకోపంగా అపర్ణ వెళ్ళిపోగా వదినకు బాగా కాలినట్టు ఉంది అంటూ రుద్రాణి మనసులో నవ్వుకుంటుంది.

మరోవైపు కృష్ణుడి విగ్రహం వద్దకు వెళ్లి నా భర్త నాకు మూడు రోజులు గడువు ఇచ్చారు. ఈ మూడు నెలలలో తను మనసు మారుతుందా.. ఈ మూడు నెలలు ఓపికగా ఉంటే నా జీవితం సంతోషంగా ఉంటుందా నాకు ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు నా భర్త మనసులో నాకు ఇంత ప్రేమ చోటు దక్కితే చాలు. నాకు ఇదే ప్రసాదించు కన్నయ్య అంటూ నమస్కరిస్తుంది

అయితే కృష్ణుడిని మొక్కుకొని కావ్య లోపలికి రావడం చూసినటువంటి రాజ్ కృష్ణుడి వద్దకు వెళ్లి ఆ కళావతి నీ దగ్గర చాలా పిటిషన్ పెట్టి ఉంటుంది కానీ తనని ఎప్పటిను నేను భార్యగా అంగీకరించలేను కేవలం తాతయ్య కోసం మాత్రమే ఇలా చేస్తున్నాను అంటూ కృష్ణుడికి నమస్కరించుకుని వెళ్ళిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తికాగా తరువాత ఎపిసోడ్ (Brahmamudi) లో కావ్య రాజ్ చాలా చనువుగా ఉండడంతో రాజ్ ప్రవర్తన చూస్తూ అపర్ణ సందేహాలు వ్యక్తం చేస్తుంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus