Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

బాలు నాయుడు,ఆశా సుదర్శన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన సస్పెన్స్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘అరణ్య ధార’. ‘సిల్వర్ స్క్రీన్ షాట్స్’ బ్యానర్ పై నిర్మాత బాలు నాయుడు అండ్ టీం ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పచ్చ, బాలు నాయుడు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మధ్యనే ‘అరణ్య ధార’ నుండి ఫస్ట్ సింగిల్ గా ‘యుగానికే ప్రయాణమే’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘అరణ్య ధార’ ట్రైలర్ ను ‘ది 100’ మూవీ దర్శకులు  రాఘవ్ ఓంకార్ శశిధర్ లాంచ్ చేశారు.

Aranya Dhara Trailer

ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 1: 52 నిమిషాల నిడివి కలిగి ఉంది. ప్రియురాలు కనిపించకుండా పోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిన హీరోని.. పోలీస్ అయినటువంటి హీరోయిన్ తండ్రి అరెస్ట్ చేసి విచారిస్తాడు. ఆ టైంలో ఊహించని విధంగా హీరోయిన్ తండ్రి కూడా మాయమవుతాడు.

తర్వాత హీరో వెళ్లి ఓ అడవిలో పడతాడు. ట్రైలర్లో ఎక్కువ షాట్స్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నాయి. సో కథకి, ఫారెస్ట్ కి లింక్ చేస్తూనే ‘అరణ్య ధార’ అనే టైటిల్ ను పెట్టారు. అయితే కథలో ఉన్న డెప్త్ తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. 

 
ట్రైలర్స్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మైథలాజికల్ టచ్ ఇచ్చినట్టు కూడా చిత్ర బృందం సాంగ్ లాంచ్ టైంలో రివీల్ చేసింది. అది కనుక వర్కౌట్ అయితే సినిమా ఆకట్టుకునే అవకాశాలు ఉంటాయి. ట్రైలర్ అయితే బాగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus