ఓ సీనియర్ నటిపై పోలీస్ కేసు ఫైల్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. మలయాళ నటి శ్వేతా మీనన్ పై పోలీస్ కేసు నమోదైంది. అస్లీల చిత్రాల పంపిణీ చేస్తూ ఈమె డబ్బు సంపాదిస్తుంది అని ఎర్నాకులం పోలీసులకు ఫిర్యాదు వెళ్ళింది. మార్టిన్ మోనాచేరి అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సెక్షన్ 67 A కింద శ్వేతా మీనన్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదవ్వడం కూడా జరిగింది.
డబ్బు కోసమే ఆమె మొదటి నుండి అశ్లీలతను ప్రోత్సహిస్తుందని.. అస్లీల నిరోధక చట్టానికి చెందిన వారు సైతం శ్వేతా మీనన్ పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో శ్వేతా మీనన్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తుంది. ఇక శ్వేతా మీనన్ మలయాళ సినీ పరిశ్రమకు చెందిన నటే అయినప్పటికీ.. తెలుగులో 1995 లో వచ్చిన ‘దేశద్రోహులు’ సినిమాతో తెలుగులో డెబ్యూ ఇచ్చింది.
అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఆనందం’ సినిమాలో ‘మోనాలిసా’ అనే పాటలో కూడా నర్తించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. అటు తర్వాత 2011 లో నాగార్జున హీరోగా వచ్చిన ‘రాజన్న’ సినిమాలో సైతం దొరసాని పాత్రలో నటించి మెప్పించింది. విలక్షణ నటిగా ఈమె మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ.. ఎక్కువగా గ్లామర్ మూవీస్ లో ఇంటిమేట్ సీన్స్ లో నటించడం వల్ల ఈమె పై అస్లీల చిత్రాల నటి అనే ముద్ర ఎక్కువగా పడింది.