“అరవింద సమేత” ఆడియో వేడుక ఎప్పుడంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతచిత్రాలైన బృందావనం, బాద్షా లకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించారు. ఇప్పుడు మూడో సారి ట్యూన్స్ ఇస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “అరవింద సమేత వీర రాఘవ” సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదివరకు రెండు సినిమాలకు మించి స్వరాలను సమకూర్చారు. ఆ పాటలను రిలీజ్ చేసే తేదీని ఫిక్స్ చేశారు. ఈనెల 20 న హైదరాబాద్ లోని “నోవాటెల్” హోటల్లో నిర్వహించాలని దర్శకనిర్మాతలు డిసైడ్ అయ్యారు.

సిరివెన్నెల, రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి తమన్ అందించిన సంగీతం మాస్, క్లాస్ ప్రజలను ఆకట్టుకుంటాయని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది. ఎన్టీఆర్ రెండు షేడ్స్ చూపించబోతున్న ఈ చిత్రంలో  పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో కనిపించబోతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన రిలీజ్ కానుంది. ఇందులో తారక్ రాయలసీమ యాసలో మాట్లాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus