సరైనోడు తర్వాత అల్లు అర్జున్ అంతకంటే హిట్ కొట్టాలని భావిస్తున్నారు. అందుకే హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా కోసం శ్రమిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఆడియోని కూడా నెట్లో రిలీజ్ చేయనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 23 న రిలీజ్ కానుంది. ఇది థియేటర్లోకి రాకముందే నెక్స్ట్ సినిమాని మొదలెట్టనున్నారు. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ నటించనున్నారు. శిరీషా శ్రీధర్ లగడపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి బన్నీ వాసు కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. కె నాగేంద్రబాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే పేరును చిత్ర బృందం పరిశీలిస్తోంది.
యంగ్ సోల్జర్ గా అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాలో తండ్రి పాత్రలో అర్జున్ నటిస్తున్నట్లు తెలిసింది. అర్జున్ కూడా గతంలో అనేక దేశభక్తి సినిమాలు చేశారు. ఇది కూడా ఆ జానర్ కావడంతో వక్కంతం వంశీ సీనియర్ నటుడు అర్జున్ ని కలవడం, నటించడానికి ఆయన ఒకే చెప్పడం జరిగిపోయాయని తెలిసింది. ప్రస్తుతం నితిన్ లై మూవీలో నటిస్తున్న అర్జున్, ఈ మూవీ పూర్తి అయిన వెంటనే ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ టీమ్ తో కలవనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.