“బద్రి, నాని” లాంటి సినిమాలతో హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని.. అనంతరం ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ అమీషా పటేల్ అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా హాట్ ఫోటోలతో సందడి చేస్తూ వస్తోంది. స్టార్ హీరోయిన్ గా భారీ సినిమాలు చేయడమే కాక, హీరోల మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచిన అమీషా పటేల్.. ఇప్పుడు మరో కొత్త కాంట్రవర్సీలో ఇరుక్కుంది.
కొన్నేళ్ల క్రితం ఆమె ఓ ప్రైవేట్ ఈవెంట్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తాను అంటూ ఒప్పుకొని.. అడ్వాన్స్ కూడా తీసుకుంది. తీరా ఈవెంట్ మ్యానేజర్లు వెయిట్ చేస్తుండగా.. ఎవరికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈవెంట్ కి అటెండ్ అవ్వకపోగా.. ఫోన్లు కూడా ఆన్సర్ చేయలేదట. దాంతో డబ్బులు వెనక్కి ఇవ్వమని కోరారు ఈవెంట్ మ్యానేజ్మెంట్ సంస్థ. ఈ విషయమై కొంత హడావుడి జరిగాక, కొంచం డబ్బు రూపేణా, మిగతా 4.5 లక్షల రూపాయలకు చెక్ ఇచ్చిందట అమీషా పటేల్.
అయితే.. ఆ చెక్ బౌన్స్ అయ్యింది. దాంతో ఈవెంట్ మ్యానేజ్మెంట్ సంస్థ ప్రతినిధి పవన్ వర్మ పోలీస్ కేస్ దాఖలు చేశాడు. అప్పటినుండి ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ కోర్ట్ అమీషా పటేల్ కి నోటీసులు పంపుతూనే ఉంది. అయితే.. అమీషా పటేల్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. దాంతో జడ్జ్ కి చిర్రెత్తుకొచ్చి.. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశాడు. కోర్టు సమయాన్ని వృథా చేయడమే కాక, న్యాయ వ్యవస్థకి గౌరవం ఇవ్వడం లేదని కోప్పడి.. మార్చి 27న గనుక ఆమె కోర్టులో హాజరుకాకపోతే.. ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేయబడుతుంది అని ఉత్తరువులు జారీ చేసింది.
ఇప్పుడు అమీషా పటేల్ గనుక మార్చి 27న ఉత్తర్ ప్రదేశ్ లోని మురాదాబాద్ కోర్టులో హాజరవ్వకపోతే.. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ముంబై వచ్చి మరీ ఆమెను అరెస్ట్ చేసే సౌలభ్యం ఉంది. మరి అమీషా ఇప్పటికైనా ఈ విషయమై రెస్పాండ్ అయితే బాగుండు. ఎందుకంటే.. రీసెంట్ గానే ఇలా చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ పాపులర్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ అరెస్ట్ అవ్వడం చూసాం.