Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

పద్ధతిగా, పల్లెటూరి అమ్మాయిగా టాలీవుడ్‌లో కెరీర్‌ ప్రారంభించిన ఆ అందం.. ఆ తర్వాత గ్లామర్ టచ్‌ ఇచ్చి తనెంత వెర్సటైల్‌ యాక్టరో, తన కథల ఎంపిక ఎంత వైవిధ్యంగా ఉంటుందో చెప్పకనే చెప్పారు అషికా రంగనాథ్‌. ‘నా సామి రంగా’ సినిమాలో కనిపించిన అషికా.. ఆ తర్వాత సినిమాల్లో కనిపించిన అషికా ఒకరు కాదు అంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు ‘సర్దార్‌ 2’ సినిమాతో తనలోని మరో యాంగిల్‌ని చూపించి మెప్పించింది.

Ashika Ranganath

ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి సరసన నటించిన ‘విశ్వంభర’ సినిమా, ఆ సెట్‌లో తనకు ఎదురైన అనుభవాల గురించి వివరంగా చెప్పుకొచ్చింది. ‘చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతమైన అనుభూతి. చిన్నప్పటి నుండి ఆయన పాటలు వింటూ, డ్యాన్సులు చూస్తూ పెరిగాను. అలాంటిది ఆయనతో కలసి నటించడం గర్వంగా ఉంది. సెట్‌లో ఆయన పంచుకునే అనుభవాలు నటులకు ఎంతో స్ఫూర్తినిస్తాయి అని చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత త్రిష గురించి మాట్లాడుతూ సంబరపడిపోయింది. ఆ సినిమా సెట్‌లోనే త్రిషను కలిశా. ఆమె ఎంతో అందంగా ఉంది.. అని చెప్పిన అషికా ఆమె త్రిషను కలవడం అద్భుతమైన ఫ్యాన్‌ గర్ల్ మూమెంట్ అని చెప్పింది. ఎన్నో ఏళ్లుగా త్రిషను అభిమానిస్తున్నానని.. ఆ రోజు కలవడంతో తన చిరకాల కోరిక నెరవేరింది అని చెప్పింది ఆషికా. నా సినీ ప్రయాణం కన్నడ ఇండస్ట్రీలోనే మొదైలంది. అది నా సొంత ఇల్లు. ఉదయం లేచి ఇంటి భోజనం చేసి షూటింగ్‌కు వెళ్లి రావడం ఇష్టం అని చెప్పింది.

అయితే, కెరీర్ మొదట్లో భాష రాకపోవడంతో వేరే ఇండస్ట్రీలోకి వెళ్లడానికి భయపడి కంఫర్ట్ జోన్‌లోనే ఉండిపోయానని చెప్పిన ఆషికా.. ఇప్పుడు తెలుగు, తమిళంలో నటిస్తూ నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నా అని తెలిపింది. ఎస్‌కెఎన్‌ నిర్మాణంలో ఓ సినిమా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో శ్రీవిష్ణు హీరోగా మరో సినిమా చేస్తోంది ఆషికా రంగనాథ్‌.

రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus