వెంకీ కుడుముల (Venky Kudumula) పేరు వినగానే యువ ప్రేక్షకుల్లో కాస్త ఫన్ టచ్, స్టయిలిష్ కామెడీ గుర్తుకు వస్తుంది. ఛలో,(Chalo) , ‘భీష్మ’ (Bheeshma), రాబిన్ హుడ్ (Robinhood) సినిమాల ద్వారా వెంకీ తనదైన మార్క్ సృష్టించాడు. కానీ ఇతని కథలు, డైలాగ్స్‌లో ఎక్కడో త్రివిక్రమ్ (Trivikram) శైలికి దగ్గరగా ఉన్న టోన్ కనిపిస్తుంది. ఇదంతా యాదృచ్ఛికమా కాపీనా? అని అనుకునే ముందు, వెంకీ చెప్పిన నిజాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకీ మాట్లాడుతూ, త్రివిక్రమ్ తన గురువు అని అఫీషియల్‌గా చెప్పారు.
“అఆ (A AA) సినిమాకి అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ సమయంలో ఆయన వర్క్ ఎథిక్, డైలాగ్ డెలివరీ స్టైల్, స్క్రీన్‌ప్లే వర్క్ చూసి పూర్తిగా ప్రభావితుడినయ్యాను,” అని తెలిపారు. అప్పట్నుంచి త్రివిక్రమ్ ని గురూజీగా మైండ్‌లో ఫిక్స్ అయిపోయారట. ఇప్పటికీ అప్పుడప్పుడూ కలుస్తున్నా, ఆయన ఎదుట కూర్చోవాలంటే భయమేస్తుందని వెంకీ చెబుతాడు. “త్రివిక్రమ్ గారి దగ్గరకి కథ చెప్పాలంటే ఒళ్లు వణికిపోతుంది. స్కూల్‌లో టీచర్ ముందు హోంవర్క్ లేకుండా వెళ్ళినట్టే ఫీల్ వస్తుంది,” అని ఆయన నవ్వుతూ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు, ఇప్పటి వరకు త్రివిక్రమ్‌కి వెంకీ తన స్క్రిప్ట్ చూపించలేదట. ఎందుకంటే భయంతో పాటు, తనలో ఇంకా చాలా మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉందనే ఫీలింగ్ వల్ల అని చెబుతున్నాడు. వెంకీ చెప్పినట్లు త్రివిక్రమ్ చెప్పే ఒక్క మాటతో ఓ సీన్‌లో మార్పులు తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంటుందట. అందుకే ఆయన మాటల్ని గౌరవంగా తీసుకుంటానని చెప్పాడు. గురువు గారి ఎదుట నెర్వస్ ఫీల్ అవడం చాలా కామన్ కానీ, త్రివిక్రమ్ ప్రభావం వల్లే తాను రైటింగ్‌ను మరింత శ్రద్ధగా చూసుకున్నానని చెబుతున్నాడు వెంకీ.
ఇప్పుడు వెంకీ దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్ సినిమాపై మంచి హైప్ ఉంది. నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela), కేతిక శర్మ (Ketika Sharma) నటిస్తున్న ఈ సినిమా, మాస్ యాక్షన్‌తో పాటు వెంకీ మార్క్ కామెడీకి కూడా మినిమం గ్యారెంటీగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి. దీనితో పాటు, గురూజీకి మెంటల్‌గా ఒప్పించగలిగే స్థాయిలో ఓ సినిమా తీయాలన్న లక్ష్యంతో వెంకీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.