Inaya Sulthana: ముస్లిం అమ్మాయిని కూడా మాయచేసిన వేణు స్వామి.. ఇదెక్కడి విడ్డూరం!

వేణు స్వామి తెలుసు కదా.. సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి ‘జగపతి’ ‘అతడు’ వంటి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాడు. నటుడిగా ఫెయిల్ అవ్వడంతో.. అదే సినీ పరిశ్రమ గురించి ఫ్రీగా జోస్యం చెప్పి పాపులర్ అయ్యాడు. బాబు గోగినేని వల్ల ఇతను సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు. దీంతో బోలెడన్ని యూట్యూబ్ ఛానల్స్ లో షోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానల్స్ వందల్లో ఉన్నాయి కాబట్టి.. ఇతని హవా నడుస్తోంది.

కేవలం స్టార్ హీరోలు, హీరోయిన్ల సినిమాల వరకు మాట్లాడి వదిలేస్తే పర్వాలేదు, వారి పర్సనల్ లైఫ్ గురించి, వారి కెరీర్ గురించి కూడా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ వైరల్ అవుతూ ఉంటాడు వేణు స్వామి.అయినప్పటికీ ఇతని మాయలో చాలా మంది హీరోయిన్లు పడ్డారు. వారికి ఏదో పూజలు పేర్లు చెప్పి.. ఇప్పటికే లక్షల్లో వసూలు చేశాడు వేణు స్వామి అని ఇన్సైడ్ టాక్. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఇనయ సుల్తానా కూడా చేరింది. ఆమె ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్.

కొన్ని సినిమాల్లో నటించింది కానీ సక్సెస్ కాలేదు. ‘బిగ్ బాస్ ‘ వల్ల కూడా ఈమెకు కలిసొచ్చింది అంటూ ఏమీ లేదు. అవకాశాలు కూడా లేకపోవడంతో వేణు స్వామిని ఆశ్రయించింది ఈ బ్యూటీ. ఈమె వేణు స్వామి చెప్పిన పూజలు చేస్తున్నట్లు కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ‘ముస్లిం అమ్మాయిని కూడా తన మాటలతో మాయ చేశాడు వేణు స్వామి’ ‘ఇప్పుడు ఇనయ సుల్తానా (Inaya Sulthana) స్టార్ అయిపోతుందా?’ అంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus