Rashmi: రష్మీతో పాటు మందు కొడుతున్న మరో వ్యక్తి ఎవరు?

  • December 30, 2022 / 08:00 PM IST

కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించిన రష్మీ.. పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయింది. అయితే తర్వాత ‘జబర్దస్త్’ కు యాంకర్ గా ఎంట్రీ ఇచ్చాక మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ‘జబర్దస్త్’ కు అనసూయ హైలెట్ అయితే.. ఎక్స్ట్రా జబర్దస్త్ కు రష్మీ హైలెట్ అన్నట్లు ఉండేది. మొదట్లో వచ్చీరాని తెలుగులో మాట్లాడి.. తర్వాత సుధీర్ తో ప్రేమాయణం వంటి వార్తలతో రష్మీ ఇమేజ్ బాగా పెరిగింది. తర్వాత బుల్లితెర పై వరుస షోలలో పాల్గొంటూనే మరోపక్క సినిమాల్లో కూడా అడపాదడపా నటిస్తూ వస్తోంది రష్మీ.

ఈమె ఫోటోలకు గతంలో సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. చాలా మంది నెటిజెన్ల పై ఈమె మండిపడుతూ రిప్లైస్ కూడా ఇచ్చేది. తర్వాత అవి తగ్గిపోయాయి. అయితే సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోవర్స్ సంఖ్య ఉంది. అందువల్ల ఈమె పోస్ట్ చేసే ప్రతి ఫోటో హైలెట్ గా నిలుస్తుంటుంది. తాజాగా రష్మీ తన ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీని పోస్ట్ చేసింది. ఇందులో రష్మీతో పాటు మరో యాంకర్ దీపిక పిల్లి కూడా ఉన్నట్లు స్పష్టమవుతుంది.

వీరితో పాటు మరో అమ్మాయి కూడా ఉందనిపిస్తుంది. కానీ ఆమె ఎవరో ఈ ఫొటోల్లో క్లారిటీ లేదు. ఈ ముగ్గురు కూడా ఇయర్ ఎండ్ పార్టీ పేరుతో మందు కొడుతూ చిల్ అవుతున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మందు బాటిల్, మందు గ్లాస్ పట్టుకుని రష్మీ ఈ ఫోటోకు ‘ఇదే లాస్ట్’ అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus