Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా గత వారం రిలీజ్ అయ్యింది. దీనికి రివ్యూస్ వంటివి బాగానే వచ్చినా మౌత్ టాక్ ఆశించిన స్థాయిలో లేదు. అందువల్ల ఓపెనింగ్స్ వరకు ‘కింగ్డమ్’ కి పాస్ మార్కులు పడ్డాయి. కానీ వీక్ డేస్ లో బాగా డౌన్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలంటే 2వ వీకెండ్ కూడా మొదటి వీకెండ్ స్థాయిలో ఓపెనింగ్స్ పడాలి. 2వ వీకెండ్ కు కొత్త సినిమాలు అయితే ఏమీ లేవు. ఇది ‘కింగ్డమ్’ కి కలిసొస్తుంది అనుకునే లోపు ‘అతడు’ వచ్చి గాలి తీసేసేలా ఉంది.

Kingdom

అవును ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. సో మహేష్ అభిమానులకు పండుగ రోజు. అందుకే ‘అతడు’ని 4K కి డిజిటలైజ్ చేసి విడుదల చేస్తున్నారు. ‘అతడు’ ని టీవీల్లో ఎక్కువ మంది చూశారు. ఈసారి బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయాలనుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. బుక్ మై షో లో బుకింగ్స్ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి.

ఇలా బుక్ మై షోలో ‘అతడు’ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో లేదో.. చాలా ఏరియాల్లో బుకింగ్స్ ఆల్మోస్ట్ క్లోజింగ్ కు వచ్చేస్తున్నాయి. హైదరాబాద్ మేజర్ థియేటర్స్ తో పాటు ఆంధ్రాలో ఉన్న చాలా సింగిల్ స్క్రీన్స్ లో ‘అతడు’ రీ రిలీజ్ కు మంచి డిమాండ్ ఏర్పడుతుంది.

కచ్చితంగా తెలుగు రీ- రిలీజ్ సినిమాల్లో ‘అతడు’ రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి ‘కింగ్డమ్’ సెకండ్ వీకెండ్ పై గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. సో ‘కింగ్డమ్’ బయ్యర్స్ గట్టెక్కడం అనుమానంగానే కనిపిస్తుంది.

హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus