Atharva Review in Telugu: అథర్వ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • కార్తీక్ రాజు (Hero)
  • సిమ్రాన్ చౌదరి (Heroine)
  • ఐరా, కల్పిక గణేష్, కబీర్ దుహాన్ సింగ్, జి.మారిముత్తు , కంచెరపాలెం రాజు తదితరులు (Cast)
  • మహేష్ రెడ్డి (Director)
  • సుభాష్ నూతలపాటి (Producer)
  • శ్రీచరణ్ పాకాల (Music)
  • చరణ్ మాధవనేని (Cinematography)
  • Release Date : డిసెంబర్ 1, 2023

డిసెంబర్ నెలలోకి అడుగు పెట్టేశాం. మొదటి వారమే క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందరి దృష్టి ‘యానిమల్’ పైనే ఉంది. అయినప్పటికీ చిన్న సినిమాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అందులో ‘అథర్వ’ మూవీ కూడా ఒకటి. ఈ సినిమాల టీజర్, ట్రైలర్స్ చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. మరి ఈ సినిమా ఆ అంచనాలకు తగ్గట్టు ఉందో లేదో ఓ లుక్కేద్దాం రండి :

కథ: దేవ్ అథర్వ కర్ణ (కార్తీక్ రాజు) ఓ పల్లెటూరికి చెందిన కుర్రాడు. పోలీస్ అవ్వాలనేది అతని లక్ష్యం. చిన్నప్పటి నుండి దానికోసమే కలలు కంటూ ఉంటాడు. అయితే అతనికి ఆస్తమా ఉండటంతో ఫిజికల్ టెస్టుల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. దీంతో అతని ఊరి జనాలు నిత్యం అతన్ని అవమానిస్తూ ఉంటారు. అయితే ఓ పెద్దాయన(కంచెరపాలెం రాజు) సూచన మేరకు క్లూస్ టీంకి అప్లై చేస్తాడు. ఆ ప్రయత్నం వర్కౌట్ అవుతుంది. ఆ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి అడుగుపెడతాడు. తక్కువ టైంలోనే అతని తెలివి తేటలతో ఓ పెద్ద దొంగతనం కేసును సాల్వ్ చేస్తాడు.దాంతో అతనికి మంచి పేరు వస్తుంది. అదే టైంలో కాలేజీ రోజుల్లో ప్రేమించిన జూనియర్ అమ్మాయి నిత్య (సిమ్రన్ చౌదరి) అతనికి మళ్ళీ పరిచయమవుతుంది.

ఆమె క్రైం రిపోర్టర్ గా మీడియాలో వర్క్ చేస్తుంటుంది.ఇదే టైంలో నిత్య తన స్నేహితురాలు, టాప్ హీరోయిన్ అయిన జోష్ని (ఐరా)ని కర్ణకు పరిచయం చేస్తుంది. ఒకరోజు నిత్య, కర్ణ జోష్ని ఇంటికి వెళ్తే.. అక్కడ ఆమె అలాగే ఆమె ప్రియుడు(శివ) చచ్చిపడుంటారు. ఇదే విషయాన్ని కర్ణ.. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయగా వారు వచ్చి…’అనుమానంతోనే ప్రియుడు శివ హీరోయిన్ జోష్ని ని గన్ తో కాల్చి చంపేసి,ఆ తర్వాత తాను కూడా కాల్చుకుని చనిపోయాడు’ అంటూ కేసుని క్లోజ్ చేస్తారు.కానీ కర్ణ దర్యాప్తులో అది హత్య అని తేలుతుంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఎటువంటి సాయం అతనికి లభించదు. మరి ఈ కేసుని కర్ణ ఎలా సాల్వ్ చేశాడు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: కార్తీక్ రాజు గతంలో ‘కౌసల్య కృష్ణ మూర్తి’ ‘పడేసావే’ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ వంటి సినిమాల్లో నటించాడు. కానీ ఈ సినిమాలో ఫుల్ లెన్త్ హీరోగా కనిపించాడు. లుక్స్ పరంగా, నటన పరంగా కూడా ఈ సినిమాతో అతను పాస్ మార్కులు వేయించుకున్నాడు అని చెప్పొచ్చు. సిమ్రాన్ చౌదరి కూడా అందరికీ సుపరిచితమే. ‘పాగల్’ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంది అని చెప్పొచ్చు.సారా పాత్రలో కల్పిక గణేష్ పర్వాలేదు అనిపించింది.

కబీర్ దుహాన్ సింగ్, జి.మారిముత్తు , కంచెరపాలెం రాజు వంటి వారి పాత్రలు అతిథి పాత్రల్లా ఉన్నాయి. అయినప్పటికీ తమ వంతు న్యాయం వారు చేశారు. ఐరా,శివ పాత్రలకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించలేదు కానీ కథ మొత్తం వీరి పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఉన్నంతలో వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పొచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు మహేష్ రెడ్డి ఎంపిక చేసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో క్లూస్ టీం అనేది ఒకటి ఉంటుందని, ప్రతి క్రైమ్ ని సాల్వ్ చేయడానికి వారి కష్టం ఎంతో ఉంటుంది అని ఈ సినిమాలో చూపించారు. ఫస్ట్ హాఫ్ పరంగా బాగానే అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ కొంత స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ఓకే. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ ఓకే.

శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. పాటలు మాత్రం సీరియస్ గా సాగుతున్న కథకి అడ్డం తగులుతున్న ఫీలింగ్ కలిగిస్తాయి.నిర్మాత సుభాష్ నూతలపాటి ఖర్చుకి వెనకాడలేదు అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ కూడా బాగా పేలాయి.

విశ్లేషణ: ‘అథర్వ’ (Atharva) ఓ కొత్త పాయింట్ తో రూపొందిన సినిమా. ఈ వీకెండ్ కి ఒకసారి ట్రై చేసే విధంగానే ఉందని చెప్పొచ్చు.

రేటింగ్ : 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus