క్రికెటర్ తో ప్రేమ, పెళ్లి.. హీరోయిన్ ఏమంటుందంటే?

ప్రముఖ సీనియర్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి త్వరలోనే క్రికెటర్ కెఎల్ రాహుల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి ఉండడానికి ముంబైలో బ్రాండ్ న్యూ హోమ్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ తో పెళ్లి వార్తలపై స్పందించింది అతియా శెట్టి.

ఇటీవల ఓ ఛానెల్ తో ముచ్చటించిన అతియాకు రాహుల్ తో డేటింగ్, పెళ్లి రూమర్స్ పై ప్రశ్న ఎదురైంది. ఇది విని ఆమె నవ్వేసింది. ఆ తరువాత మాట్లాడుతూ.. ‘దీనిపై నేను ఎలాంటి కామెంట్ చేయలేను. ఈ రూమర్స్ విని విని విసిగిపోయాను. ఈ వార్తలకు నేను నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేను. జనాలకు ఎలా అనిపిస్తే అలా అనుకోనివ్వండి. వారికి నచ్చినట్లుగా వారు ఆలోచిస్తున్నారు’ అని బదులిచ్చింది.

అలాగే రాహుల్ తో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్న వార్తలపై కూడా ఆమె స్పందించింది. ‘నేను కొత్త ఇంటికి మారుతున్న విషయం నిజమే కానీ ఎవరితోనో కాదు. నా ఫ్యామిలీతోనే. త్వరలోనే మా అమ్మ, నాన్నతో పాటు నా సోదరుడితో కలిసి ముంబై బాంద్రాలో కొత్త ఇంటికి మారబోతున్నా’ అని చెప్పుకొచ్చింది.

గత మూడేళ్లుగా కెఎల్ రాహుల్, అతియాలు సీక్రెట్ డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే వారి రిలేషన్ ను అఫీషియల్ చేశారు. కెఎల్ బర్త్ డే సందర్భంగా ‘ఎక్కడైనా నీతోనే.. హ్యాపీ బర్త్ డే’ అని అతియా పోస్ట్ చేసింది. దీంతో త్వరలోనే ఈ జంట వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus