అట్లీ (Atlee Kumar) డైరెక్షన్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా సిద్ధమవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పటికే దుబాయ్‌లో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేశారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బన్నీ రూ.170 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడన్న వార్తలు వినిపించాయి. అట్లీ కూడా ఈ సినిమా గురించి పూర్తి ఫోకస్ పెట్టగా, గతంలో ఓకే చేసిన ఇతర ప్రాజెక్టులను పూర్తి విస్మరించినట్టు సమాచారం. మొదటిగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో (Vijay Sethupathi) అట్లీ ఓ సినిమా చేయాల్సి ఉంది.
మురాద్ ఖేతాని (Murad Khetani) నిర్మించాల్సిన ఈ ప్రాజెక్ట్ జనవరిలో సెట్స్ మీదకి రావాల్సి ఉంది. కానీ ‘బేబిజాన్’ (Baby John) ప్లాప్ తరువాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మరోవైపు షాహిద్ కపూర్‌తో (Shahid Kapoor) కూడా అట్లీ ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. ఇద్దరూ కథపై చర్చలు పూర్తిచేసుకున్నప్పటికీ, షాహిద్ డేట్స్ సెట్ కాకుండా పోవడం, ‘దేవా’ (Deva) మూవీ ఫెయిల్యూర్ కావడంతో ఆ సినిమా కూడా ఫ్రీజ్ అయిపోయింది. అంతేకాదు, ప్రముఖ బిజినెస్‌మెన్ సునీల్ శెట్టి అల్లుడు వీర్ పహారియాతో అట్లీ ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది.
తన భార్య నిర్మాణంలో చేయాల్సిన ఆ సినిమా కూడా బన్నీ సినిమా ఫైనల్ అయిన తర్వాత పూర్తిగా పట్టించుకోకుండా అట్లీ వదిలేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఇది ఇండస్ట్రీలో ‘‘అట్లీ బన్నీ కోసమే మిగతా హీరోల్ని పక్కన పెట్టేశాడా?’’ అనే కామెంట్స్ కు దారితీస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లీ పూర్తిగా అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌కే అంకితమవుతున్నాడు. బన్నీ క్రేజ్, మార్కెట్ పరంగా భారీ లెవెల్‌లో ఉండడం, తక్కువ సమయంలో ఎక్కువ హైప్ క్రియేట్ చేయగలడన్న విశ్వాసంతో అట్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.
కానీ గతంలో చెప్పిన మాటల్ని నిలబెట్టుకోకపోవడంతో ఆయనపై ‘‘సెల్ఫిష్ డైరెక్టర్’’ అన్న ముద్ర పడే ప్రమాదం ఉంది. అట్లీ టాలెంట్ గురించి ఎవరికీ సందేహం లేదు. కానీ తన ప్రాధాన్యతలు ఎంత వరకూ బిజినెస్ పరంగా తీసుకోవచ్చో, ఇమేజ్ పరంగా ఎలా ప్రభావం చూపుతుందో అన్నదే ఇప్పుడు ప్రశ్న. బన్నీతో సినిమా ఖచ్చితంగా హై ఎక్స్‌పెక్టేషన్‌పై ఉందనడంలో సందేహం లేదు. కానీ ఓ దర్శకుడిగా కమిట్ అయిన సినిమాలను పూర్తిగా పక్కన పెట్టడం, మిగతా నటులను నిరుత్సాహపర్చడం వర్కౌట్ అవుతుందా అన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం.