Atlee: అట్లీ సంచలన స్టేట్మెంట్.. ఓవర్ కాన్సిడెన్స్ అంటూ కామెంట్లు రావడంతో?

  • October 10, 2023 / 12:37 PM IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో అట్లీ ఒకరు కాగా ఈ డైరెక్టర్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. వరుసగా విజయాలు సాధిస్తున్న అట్లీ రాబోయే రోజుల్లో సైతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. షారుఖ్, విజయ్ తో మల్టీస్టారర్ మూవీ చేసి ఆ సినిమాతో 3,000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడమే తన టార్గెట్ అని అట్లీ చెప్పుకొచ్చారు. అట్లీ సంచలన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండగా ఈ రికార్డ్ సొంతం కావాలంటే అట్లీ మూవీ బాహుబలి2 రికార్డులను సైతం బ్రేక్ చేయాల్సి ఉంది.

ఓటీటీల హవా కొనసాగుతున్న తరుణంలో అట్లీ భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించి పాన్ ఇండియా హిట్ సాధించడం సులువైన విషయం కాదు. అయితే అట్లీది కాన్ఫిడెన్స్ కాదని ఓవర్ కాన్ఫిడెన్స్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వరుస విజయాలతో అట్లీ రెమ్యునరేషన్ సైతం పెరిగిందని సమాచారం అందుతోంది. అట్లీ భవిష్యత్తు సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో తెరకెక్కుతున్నాయి.

రాబోయే రోజుల్లో అట్లీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పలువురు టాలీవుడ్ హీరోలతో సైతం పని చేయాలని అట్లీ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అట్లీని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. అట్లీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంచుకోవడం అతనికి ప్లస్ అవుతోంది. అట్లీ ఇతర భాషల్లో సైతం క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

అట్లీ (Atlee) కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అట్లీ సొంతమవుతాయని చెప్పవచ్చు. అట్లీ రాబోయే రోజుల్లో 3000 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సులువుగా సాధించాలని ఆశిద్దాం. టాలీవుడ్ స్టార్ హీరోలతో అట్లీ సినిమాలు తీస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు.అట్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో రూ.3000 కోట్ల కామెంట్లు చేశారని మరి కొందరు చెబుతున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus