Atlee: 6 ఏళ్ళ నిరీక్షణ.. ‘జవాన్’ రిజల్ట్ తో తీరుతుందా?

  • September 9, 2023 / 09:00 AM IST

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇప్పుడు బాలీవుడ్లో కూడా బిజీ అయిపోయేలా ఉన్నాడు. అందుకు కారణం అందరికీ తెలుసు. షారుఖ్ ఖాన్ తో అతను ‘జవాన్’ అనే సినిమా చేశాడు. నిన్న అంటే సెప్టెంబర్ 7న ఆ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్ సినిమాల్లో మొదటి రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన సినిమాగా ‘జవాన్’ రికార్డులు సృష్టించింది. ఫుల్ రన్లో ఈ మూవీ వెయ్యి కోట్లు పైనే గ్రాస్ వసూళ్లను సాధిస్తుంది అనే నమ్మకం ట్రేడ్ పండితుల్లో కనిపిస్తుంది.

కాబట్టి బాలీవుడ్ బడా హీరోల చూపు.. ఇప్పుడు సౌత్ డైరెక్టర్లపై పడింది.మరీ ముఖ్యంగా అక్కడి బడా స్టార్లు అట్లీతో సినిమాలు చేయాలని ఆశపడుతున్నారు. అక్కడి బడా ప్రొడక్షన్ హౌస్ ల నుండి అట్లీకి ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. అయితే అట్లీకి మాత్రం మన టాలీవుడ్ హీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేయాలని ఉంది. అల్లు అర్జున్.. ప్రస్తుతం ‘పుష్ప 2’ చేస్తున్నాడు. అది పూర్తయ్యాక త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తాడు.

అది కూడా పూర్తయ్యాక సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో (Atlee) అట్లీ- అల్లు అర్జున్ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే అల్లు అర్జున్ కంటే ముందు నుండి ఎన్టీఆర్ తో సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అట్లీ. ‘వైజయంతి మూవీస్’ సంస్థ ఈ కాంబోని సెట్ చేయాలని ప్రయత్నించింది. కానీ ఎన్టీఆర్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మార్కెట్ ‘ఆర్.ఆర్.ఆర్’ వల్ల ఇంకా పెరిగింది. మరోపక్క ‘జవాన్’ తో అట్లీ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు. సో ఇలాంటి టైంలోనే వీరి కాంబో సెట్ అయితే బాగుణ్ణు అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి.. ఎన్టీఆర్ ఈసారైనా మనసు మార్చుకుంటాడేమో..!

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus