2026 ఆగస్టు బాక్సాఫీస్ ఆడియన్స్ కి ఓ వినూత్న అనుభూతి కలిగించింది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఆగస్టులో హిట్లు పడ్డాయి. బాక్సాఫీస్ కళకళలాడింది. ఈ నెలలో చిన్న సినిమాలు, డబ్బింగ్ చిత్రాలతో పాటు క్రేజీ రీ-రిలీజ్‌లు కలుపుకుని మొత్తంగా 40 వరకు చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. ‘అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి’, ‘పాంచాలి పంచభర్తృక’, ‘హుషారు పిట్టలు’, ‘కికు చిరంజీవి’ వంటి విభిన్న టైటిల్స్ తో వచ్చిన సినిమాలతో పాటు, ‘దూకుడు’, ‘శంకర్ దాదా ఎం బి బి ఎస్’ లాంటి ఎవర్ గ్రీన్ హిట్స్ రీ-రిలీజ్ అయి అభిమానులకు ఉత్సాహాన్నిచ్చాయి.
ఇన్ని సినిమాలు క్యూ కట్టినా బాక్సాఫీస్ వద్ద విజేతలుగా నిలిచినవి మాత్రం కేవలం నాలుగే. వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’, లోకేష్ కనకరాజు ‘డిసి’ (DC), సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, రవితేజ ‘ఇరుముడి’ సినిమాలు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వర్షం కురిపించాయి. మిగతా చిత్రాల్లో కొన్ని విమర్శకుల ప్రశంసలు (క్రిటికల్ అక్లెయిమ్) అందుకున్నప్పటికీ, కమర్షియల్ గా విజయాలు సాధించలేకపోయాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ‘టాక్సిక్’ సినిమా దారుణమైన ఫ్లాప్ గా మిగిలిపోవడం ట్రేడ్ వర్గాలను తీవ్రంగా నిరాశపరిచింది.
‘యముడు’, ‘మకుటం’ ‘ది రెడ్ బ్యాగ్’ వంటి సినిమాలు వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు. అగధ, పళ్ళబురుసు, అమీర్ లోగ్ వంటి సినిమాలు క్రిటిక్స్ ను మెప్పించాయి. అయితే, ఈ ఆగస్టు నెల మొత్తానికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి విన్నర్ అనిపించుకుంది మాత్రం చిత్రం ‘ఇరుముడి’ సినిమా అనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఏకంగా వంద కోట్లకు పైగా షేర్ ను రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆగస్టు కి విన్నర్ గా నిలిచింది.