Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

ఆయన గురించి ఇప్పటితరానికి పెద్దగా తెలియదు. ఎందుకంటే ఆయన గురించి ఎవరూ మాట్లాడరు. కానీ మన దేశంలో శత్రుదేశానికి వెళ్లి మనకు స్పైగా పని చేసి.. ఆ తర్వాత అక్కడి జైలులో వీరమరణం పొందారు. ఆయన్ను ఆ రోజుల్లో బ్లాక్‌ టైగర్‌ అనేవారు. మామూలుగా అయితే ఇప్పుడు ఎవరూ ఆయన గురించి మాట్లాడరు. కానీ ప్రముఖ తమిళ దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ ఓ ఇంటర్వ్యూలో బ్లాక్‌ టైగర్‌ గురించి మాట్లాడటంతో ఇప్పుడు అందరూ అతని గురించి వెతుకుతున్నారు.

Sardar 2

నా లక్ష్యం ఓ స్పై సినిమా చేయడం కాదు. ‘సర్దార్‌’ సినిమా అనుకున్న్పుడు కణ్ణన్‌ పాత్ర మదిలో మెదిలింది. అదొక రియల్‌ టైమ్‌ పాత్ర. ఫిక్సన్‌ స్టోరీ కాదు. ఆయనే రవీంద్ర కౌశిక్‌ అని చెప్పారు. దీంతో ఎవరీ రవీంద్ర కౌశిక్‌ అని నెటిజన్లు ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేయడం స్టార్ట్‌ చేశారు. ఒక సినిమాగా తీయాల్సినంతగా ఆయనేం చేశారు అని వెతికారు.

రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కి చెందిన రవీంద్ర కౌశిక్‌ ఏప్రిల్‌ 11, 1952లో జన్మించి ఆయన నాటకాలు వేసే ఓ నటుడు. మన దేశం తరఫున పాకిస్థాన్‌ వెళ్లి.. అక్కడ వారిని నమ్మించి, సైన్యంలో చేరి, మిలిటరీలో ఒక హై ర్యాంకింగ్ ఆఫీసర్‌గా మారారాయన. ఆ తర్వాత చాలా ఏళ్లు మన దేశానికి కీలక సమాచారం ఇచ్చారు. కొన్ని ఏళ్ల తర్వాత మరో వ్యక్తి కారణంగా పాక్‌ సైన్యానికి చిక్కిపోయారు. జైలు శిక్ష అనుభవిస్తూ అక్కడే చనిపోయారు.

ఇదంతా వింటుంటే ‘ధురంధర్‌’ సినిమాలు గుర్తొస్తాయి. అయితే పీఎస్‌ మిత్రన్‌కు ఈ సినిమా ఆలోచన ‘ధురంధర్‌’ సినిమాల కంటే ముందే వచ్చిందట. అయితే ఆ లైన్‌ను పూర్తి స్థాయి సినిమాగా ఓకే చేసుకొని పట్టాలెక్కించి.. సినిమాగా చేసి రిలీజ్‌ చేయడానికి ఈ సమయం పట్టిందన్నమాట. అదే ‘సర్దార్‌ 2’. ఈ సినిమాను సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అప్పుడు ఇంకొంత క్లారిటీలు వస్తాయి.

ఈ వారం 21 సినిమాలు విడుదల

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus