సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’…!

‘అవెంజర్స్’ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇందులో భాగంగా తెరకెక్కిన ఆఖరి చిత్రం కావడంతో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతవారం ఏప్రిల్ 25 న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే సూపర్ హిట్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ప్రస్తుతం ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోనూ పెద్ద సినిమాలేమీ లేవు కాబట్టి ఈ చిత్రం భారీ వసూళ్ళను రాబట్టుకుంటుంది. ఫస్ట్ వీకెండ్ కే 187కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా అదే జోరును కొనసాగిస్తుండడం.. ఆశ్చర్యం కలిగించే విషయం. సమ్మర్ హాలిడేస్ కూడా ఇందుకు ముఖ్యకారణమని చెప్పుకోవచ్చు.

ఇక విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని 224.50 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. దీంతో ‘బాహుబలి 2’ , ‘2.0’ చిత్రాల తరువాత అతి తక్కువ సమయంలో 200కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఫుల్ రన్ లో ఈచిత్రం ఇండియాలో 350 కోట్ల వరకూ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఈరోజు తో ఈ చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లైఫ్ టైం ఇండియన్ గ్రాస్ (228కోట్లు) ను క్రాస్ చేసేస్తుంది. ఇక మే 1 న కూడా హాలిడే కావడంతో ఈ చిత్రానికి మరింత కలిసొచ్చే అంశం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus