Avika Gor: ఆన్ స్క్రీన్ పెళ్లిళ్లపై చిన్నారి పెళ్లికూతురు షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న వాళ్లలో అవికాగోర్ ఒకరు. తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోని అవికగోర్ వధువు అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లికూతురిలా చీర కట్టుకుని ముస్తాబు కావడం నాకెంతో ఇష్టమని అమె అన్నారు. అందువల్లే ఇప్పటివరక్ ఇరవైసార్లు ఆన్ స్క్రీన్ లో పెళ్లి కూతురిగా మారినా ఎప్పుడూ బోర్ కొట్టలేదని ఆమె పేర్కొన్నారు.

పదేళ్ల వయస్సులో చిన్నారి పెళ్లికూతురు ధారావాహికలో నటించానని అప్పటికి పెళ్లంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. డైరెక్టర్ ఏం చెబితే అది చేసేదానినని ఆమె అన్నారు. వధువు పేరుతో నా దగ్గరకు కథ వచ్చిన వెంటనే చిన్నారి పెళ్లికూతురు గుర్తుకొచ్చిందని అవికా గోర్ తెలిపారు. ఇది ఒక భిన్నమైన కథ అని థ్రిల్లర్ మూవీగా ఆద్యంతం ఆసక్తిగా కొనసాగుతోందని ఆమె కామెంట్లు చేశారు.

ఇలా ఎందుకు జరిగిందనే ప్రశ్నలు ప్రేక్షకులను వెంటాడుతూ ఉంటాయని బెంగాళీ వెబ్ సిరీస్ కు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కిందని అవికా గోర్ అన్నారు. నటనలో భాగంగా ఇప్పటివరకు 20సార్లు పెళ్లి చేసుకుని ఉంటానని ఆమె పేర్కొన్నారు. వధువు కోసం పెళ్లిపీటలపై కూర్చున్న సమయంలో నాకు పాత రోజులు గుర్తుకొచ్చాయని అవికా గోర్ కామెంట్లు చేశారు. ఆ అనుభవం వల్లే పెళ్లి సీన్లలో నేచురల్ గా చేశానని ఆమె (Avika Gor) తెలిపారు.

వధువు ట్రైలర్ చూసి మా ఇంట్లో వాళ్లు సంతోషించారని అవికా గోర్ అన్నారు. ఆది సాయికుమార్ కు జోడీగా ఒక సినిమాలో నటిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు. హిందీలో సైతం కొన్ని ప్రాజెక్ట్ లు చేస్తున్నానని అవికా గోర్ వెల్లడించారు. నటిగా భిన్నమైన కథలలో నటించాలని ఉందని ఆమె తెలిపారు. అవికా గోర్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus