Premalu 2: కంగారుగా ఎనౌన్స్ చేసిన సీక్వెల్ షెల్వ్ అయిపోయింది

Advertisement

మలయాళ చిత్రం “ప్రేమలు” (Premalu)క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మలయాళ చిత్రసీమలో 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇక తెలుగు రీజనల్ మార్కెట్ లో ఈ సినిమా ఓ చిన్నపాటి ప్రకంపన సృష్టించింది.

Premalu 2

రాజమౌళి (Rajamouli) కుమారుడు కార్తికేయ (karthikeya) ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ ను తెలుగులో రిలీజ్ చేసి మంచి లాభాలు పొందాడు. 90’s వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాకి రాసిన తెలుగు డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.దాంతో ఒరిజినల్ మేకర్స్ వెంటనే “ప్రేమలు 2” అంటూ సీక్వెల్ ను అనౌన్స్ చేశారు.

మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ అటకెక్కిందని తెలుస్తోంది. దర్శకుడు రాసుకున్న కథ హీరో నస్లేన్ కి నచ్చలేదట. ఎన్ని వెర్షన్లు చెప్పినా తాను కన్విన్స్ అవ్వకపోవడంతో.. ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేశాడని తెలుస్తోంది. అయితే.. దర్శకుడు గిరీష్ (Girish) & హీరో నస్లేన్ (Naslen ) కాంబినేషన్ లో ఆల్రెడీ “ఐయామ్ కాదలన్” (I Am Kathalan) అనే సినిమా వచ్చి ఫ్లాపయ్యింది.

ఆ సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ కూడా ఈ సీక్వెల్ మీద పడి ఉండొచ్చు అనుకుంటున్నారు మలయాళ ఇండస్ట్రీ పెద్దలు. సో, ప్రేమలు 2 అఫీషియల్ గా ఆగిపోయినట్లే.అయితే.. “ప్రేమలు”తో నస్లేన్ కి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడగా, మమిత (Mamitha)స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో నటిస్తోంది. అలాగే.. ఆ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేసిన సంగీత్ ప్రతాప్ (Sangeeth Prathap), శ్యామ్ మోహన్ (Shyam Mohan) లు కూడా మంచి ఆఫర్లతో బిజీ అయిపోయారు.

బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus