బిగ్ బాస్ 4: ఆ డబ్బుతో అవినాష్ కష్టాలు గట్టెక్కినట్లేనా..?

  • December 14, 2020 / 04:07 PM IST

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మొత్తానికి ఫైనల్స్ లోకి చేరుకుంది. సూపర్ 5 కంటెస్టెంట్స్ లలో 50లక్షలు గెలుచుకొని టైటిల్ విన్నర్ గా నిలిచే కంటెస్టెంట్ ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే గత వారం మోనాల్ కంటే ముదు ఎలిమినేట్ అయిన అవినాష్ ఫైనలిస్ట్ లో ఉండాల్సింది అనే వాదనలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే ఈ షో ద్వారా అవినాష్ ఎంతవరకు లాభం పొందాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

అవినాష్ ఎంతో రిస్క్ చేసి మరీ బిగ్ బాస్ కు వెళ్ళాడు అనేది మాత్రం వాస్తవం. బిగ్ బాస్ లోనే తన కష్టాల గురించి చెప్పుకున్న అవినాష్ ఒక ఫ్లాట్ కొనుకున్నాక అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనట్లు చెప్పాడు. తల్లి ఆరోగ్యం కోసం భారీగా ఖర్చాయినట్లు కూడా వివరించాడు. దానికి తోడు కరోనా వల్ల షూటింగ్స్ ఆగిపోవడం కూడా అతన్ని మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ లో రెండు నెలలకుపైగా ఉన్న అవినాష్ 35 నుంచి 40లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.

ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్తలైతే సోషల్ మిడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక అవినాష్ బిగ్ బాస్ రెమ్యునరేషన్ ద్వారా కష్టాల్లో నుంచి ఎంతవరకు బయటపడ్డాడో తెలియాలి అంటే అతనే క్లారిటీ ఇవ్వాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus