బిగ్‌బాస్ ఎవరికీ కనిపించడు.. మాటలు మాత్రమే వినిపిస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈసారి బిగ్‌బాస్‌ను మీ మధ్యకే తీసుకొస్తా అంటూ బిగ్‌బాస్ కొత్త టాస్క్‌ను క్రియేట్ చేశాడు. దీనికి ఆత్మ, మెరుపులు, ఉరుములు అంటూ కొంచెం స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా పెట్టాడు. అది కాస్త ఓవర్ అనిపించినా… బిగ్‌బాస్ ఆత్మ ఆవహించాక అవినాష్ చేసిన సందడి అయితే సూపర్. ఒక్కో ఇంటి సభ్యులు అడిగిన ప్రశ్నలకు బిగ్‌బాస్ ఆత్మ సమాధానాలిచ్చింది. అలాగే ఇంటి సభ్యుల మీద అభిప్రాయాలు కూడా చెప్పింది.
మొత్తం నాలుగు బిగ్‌బాస్ సీజన్లలో ఏ సీజన్ బెస్ట్ అని నోయల్ ఆడగగా… ఈ సీజన్ కంప్లీట్ అయ్యాక చెప్తా అని బిగ్‌బాస్ ఆత్మ చెప్పింది. మన షో టీర్పీ రేటింగ్ ఐపీఎల్‌ని దాటి వెళ్లిపోయింది కదా.. మీ అభిప్రాయం ఏంటి అని కుమార్ సాయి అడిగాడు. బిగ్‌బాస్ ఎప్పటికీ నెంబర్‌వన్ షో, బిగ్‌బాస్ దేనినైనా దాటేస్తుంది అని బిబి ఆత్మ చెప్పింది. నాకు నిద్రొస్తే ఎందుకు ఆపుతున్నారు అంటూ కెప్టెన్ అడగగా, ఇక్కడ ఆడటానికి వచ్చావ్ నిద్రపోవడానికి కాదు. ఇంకోసారి నిద్రపోతే కెప్టెన్సీ పోతుంది అని బిగ్‌బాస్ చెప్పాడు. నేను మీ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ అంటూ ఉంటా కదా దానికి మీ ఫీలింగ్ ఏంటి అని ఆరియానా అడిగింది. దానికి బిగ్‌బాస్ ఆత్మ అది నా ఖర్మ అని చెప్పింది.
ఈ షో ఉద్దేశం ఏంటి అని హారిక అడగగా, మంచితనం గురించి చెప్పడం, మనుషులు ఎలా ఉండాలో నేర్చుకునేలా చేయడం అని బిగ్‌బాస్ చెప్పాడు. మరి ఈ 15 మందిలో అవినాష్ బాడీలోకే ఎందుకొచ్చారు అని అమ్మ రాజశేఖర్ అడిగారు. దానికి అవినాష్ బిగ్‌బాస్‌లా ఉంటాడు కాబట్టి అని ఆత్మ సమాధానమిచ్చింది. ఇంట్లో ఫేవరేట్ హౌస్ మెంబర్ ఎవరు అంటూ సుజాత వేసిన ప్రశ్నకు అవినాష్ అని ఆత్మ చెప్పింది. ఆ తర్వాత అందరూ ఇష్టమే అని చెప్పింది.
ఆ తర్వాత ఇంటి సభ్యుల గురించి అభిప్రాయాలు కూడా చెప్పింది బిగ్‌బాస్ ఆత్మ. బాగా ఆడుతున్న అమ్మ రాజశేఖర్ మాస్టర్ అప్పుడప్పుడు మైక్ మరచిపోతున్నారు అని గుర్తు చేసింది. ఇలాంటి కంటెస్టెంట్‌ను నేను ఇన్ని సీజన్లలో ఎప్పుడూ చూడలేదు అన కూడా సెటైర్లు వేసింది. చిన్న చిన్న విషయాలకు అలగడం మానేయండి అని సుజాతకు సూచించింది బిగ్‌బాస్ ఆత్మ. సోహైల్, మెహబూబ్ కోపం తగ్గించుకుంటే మంచిది అని కూడా చెప్పింది ఆత్మ.
‘అందరితో ఈక్వెల్‌గా ఆడుతున్నారు. గత కొద్ది రోజుల్లో బాగా మారిపోయారు. తెలుగులో మాట్లాడుతున్నారు’ అంటూ హారికను పొడిగేసింది బిగ్‌బాస్ ఆత్మ. టాస్క్‌లో తెలివిగా ఆడుతున్నారు. హోటల్ టాస్క్ బాగా ఆడారు అంటూ అభిజీత్‌ను ప్రశంసించింది. ఇక ప్రినెస్స్ బాగా చేశారంటూ ఆరియానాను పొగుడుతూ అవినాష్‌ను బాగా టార్చర్ పెట్టారని సెటైర్ వేసింది. ఇంటి మనిషిలా ఉంటూ చక్కగా ఆడుతున్నారు… ఈ వయసులో కూడా అంటూ అమ్మ రాజశేఖర్‌కు కౌంటర్ పడింది.
Most Recommended Video
చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!