Sree Mukhi: హద్దులు మీరిన అవినాష్..చెంప చెళ్లుమనిపించిన శ్రీముఖి.. వీడియో వైరల్!

శ్రీముఖి ‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ అనే షోని హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సీరియల్స్ ద్వారా ఫేమ్ లోకి వచ్చిన నటీనటులు ఈ షోలో పాల్గొంటూ ఉంటారు. లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. కొత్త ఎపిసోడ్లో రెట్రో ఓల్డ్ థీమ్ తో ముక్కు అవినాష్ సందడి చేసినట్లు తెలుస్తుంది. ఫైమా, హరి పంచ్‌లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

పాత సీరియల్స్‌ కి చెందిన వారు ఈ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. వారంతా ముద్దుల టాస్క్ లో పాల్గొని రచ్చ రచ్చ చేశారు. అయితే ఈ ప్రోమోలో ఎవ్వరూ ఊహించని సన్నివేశం కూడా కనిపించింది.అదేంటి అంటే శ్రీముఖి మధ్యలో.. ‘పార్థు, ఒక్కసారి వచ్చి నాకు ముద్దు పెట్టు’ అంటూ అవినాష్ ను షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరకు తీసుకుంది. దీంతో అవినాష్ నిజంగానే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయినట్టు శ్రీముఖిని ముద్దాడబోయాడు.

ఈ క్రమంలో శ్రీముఖి (Sree Mukhi) అతని చెంప పై ఒక్కటి ఇచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. ప్రోమో మొత్తంలో ఈ విజువల్ బాగా హైలెట్ అయ్యింది అని చెప్పాలి. నిజజీవితంలో శ్రీముఖి, అవినాష్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. శ్రీముఖి ‘బిగ్ బాస్ 3 ‘ కి వెళ్ళినప్పుడు ఆమెకు ఓట్లు వేయించే బాధ్యత అవినాష్ తీసుకున్నాడు. అటు తర్వాత అవినాష్ ‘బిగ్ బాస్ 4 ‘ లో పాల్గొన్నప్పుడు శ్రీముఖి బాగా ప్రమోట్ చేసింది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus