ఆ టైమ్ లో ఏం చేయాలో తెలియలేదు..!

బిగ్ బాస్ షోలో తనదైన స్టైల్లో ఎంటర్ టైన్ చేసిన అవినాష్ తన మనసులో మాటల్ని మీడియాతో పంచుకున్నాడు. బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు ఎన్నో కష్టాలు పడ్డాను అని చెప్పాడు. గతంలో తను వర్క్ చేస్తున్న షోవాళ్లకి ఎగ్రిమెంట్ రాశాను అని, దానిని బ్రేక్ చేసి వెళ్లాలంటే ఖచ్చితంగా 10 లక్షలు కట్టాల్సిందే అని అన్నారని చెప్పాడు.

అంతేకాదు, ఆషో అప్పుడు నడవట్లేదు అని నేను వెళ్లి ఆర్ధికఇబ్బందులు ఉన్నాయి కొద్దిగా మనీ ఇమ్మని అడిగితే ఇవ్వలేదని చెప్పాడు. అంతేకాదు, బిగ్ బాస్ షోకి ఇలా 100 రోజులు వెళ్లివస్తాను అంటే, అగ్రిమెంట్ ప్రకారం వీల్లేదని చెప్పారని , ఆ టైమ్ లో నిజంగా ఏం చేయాలో తెలియలేదని, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్కుంటే ఖచ్చితంగా 10 లక్షలు కట్టాలని చెప్పారని అన్నాడు. దాంతో ఫ్రెండ్స్ ని, బందువులని అడిగి మరీ డబ్బు తెచ్చి వారికి కట్టేశాను అని అప్పుడు బిగ్ బాస్ షోకి వచ్చానని చెప్పాడు. ఇప్పుడు బిగ్ బాస్ షోలో మరి ఆ డబ్బులు వచ్చాయా అని అడిగిన ప్రశ్నకి బదులు చెప్తూ., ప్రస్తుతానికి అయితే వచ్చాయని, ఇంకా కొన్ని షోలు కూడా ఇస్తామని చెప్పారని అన్నాడు.

బిగ్ బాస్ టాప్ 5లో లేననే బాధ ఉందని, అయినా కూడా ఈ షో వల్ల నాకు చాలా మంచి జరిగిందని, ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు అవినాష్. అదీ విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus