యంగ్ హీరో ప్రయోగాల పిచ్చి పీక్స్ కి చేరిందిగా

బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా ఓ క్రేజీ హీరో. తక్కువ బడ్జెట్ తో వందకోట్ల వసూళ్లు సాధించగల మినిమమ్ గ్యారంటీ హీరో. ఆయన నటించిన గత నాలుగు ఈ చిత్రాలు వంద కోట్ల మార్కుని చేరుకొని లాభాలు పంచాయి. వైవిధ్యమైన కథలను ఎంచుకొని సూపర్ హిట్స్ అందుకోవడం ఈ హీరో నైజం. ఐతే తాజా చిత్రం చూస్తే ఈ హీరో ప్రయోగాల పిచ్చి పీక్స్ కి చేరినట్టు అనిపిస్తుంది. శుభ్ మంగళ్ జాదా సావదాన్ చిత్రంలో ఆయన గే పాత్ర చేస్తున్నారు. ఒక అబ్బాయి ప్రేమలో పడిన గే గా అతను నటిస్తున్నారు. నిన్న ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇద్దరు అబ్బాయిల ప్రేమ వలన వారి తల్లిదండ్రుల బాధలు, సొసైటీ వాళ్ళ పట్ల ప్రవర్తించే తీరును హ్యూమరస్ గా చెప్పినట్టున్నారు.

ఒకరినొకరు ఇష్టపడే అబ్బాయిలుగా ఆయుష్మాన్, గజరాజ్ రావ్ రెచ్చిపోయి నటించారు. వీరిద్దరి మధ్య లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు వీరు ఏ రేంజిలో పాత్రలలో లీనం అయ్యారో. ఐతే కొత్త పాయింట్ కోసం మరీ గే స్టోరీ తీసుకోవాలా అనిపిస్తుంది ఆయుష్మాన్ ని చూస్తుంటే. ఆయన గత చిత్రం బాలా లో బట్ట తల వలన పెళ్లికాక ఇన్ఫిరియారిటీ ఫీలయ్యే యువకుడి పాత్ర చేశాడు. అది సక్సెస్ ఫుల్ కావడంతో, ఈసారి ఏకంగా గే స్టోరీ లైన్ తో ఈ చిత్రం చేసినట్టున్నాడు. అంధాదున్ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకున్న ఈ హీరో ప్రయోగాలు ఈ చిత్రంతో కొంచెం శృతిమించినట్లుంది. ఇలాంటి స్వలింగ సాంగత్యాలను ఎంకరేజ్ చేసేవి కాకుండా సమాజానికి ఉపయోగపడే పాయింట్ తీసుకుంటే ఆయన అందుకున్న అవార్డు కి గౌరవం ఉంటుంది.


సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus