బుల్లితెరలో బాహుబలి ఎన్నిసార్లు ప్రసారమైనా తగ్గని ప్రేక్షకులు!

Advertisement

వెండితెరపై రికార్డుల సునామీ సృష్టించిన బాహుబలి.. బుల్లితెరపైన కూడా సంచలనం కలిగిస్తోంది. థియేటర్లలో 2015 జులై 10 అడుగుపెట్టిన బాహుబలి వంద రోజులు కలెక్షన్లు కురిపించి టీవీలోకి ప్రవేశించాడు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ఈ కళాఖండం 2015 అక్టోబర్ 24 న ప్రసారమై టెలివిజన్ రేటింగ్ పాయింట్ ని పరుగులు పెట్టించింది. తొలి సారి టెలికాస్ట్ అయిన రోజు మాటీవీ టీఆర్పీ 35 – 40 వరకు చేరి అప్పటి వరకు ఉన్న రికార్డులను తుడిచి వేసింది.

ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వీరోచిత విన్యాసాలు, అమోఘమైన పాటలు, అద్భుతమనిపించే గ్రాఫిక్స్ ఇలా అనేక అంశాలు తెలుగు ప్రేక్షకులను టీవీ ముందు కూర్చోబెడుతున్నాయి.  కొన్నిసారు ప్రసారం కాగానే ఏ సినిమాకు అయినా టీఆర్పీ క్రమంగా తగ్గిపోతుంది. ఆ రూల్ ని మార్చేసింది బాహుబలి. ఇప్పటి వరకు బాహుబలి టీవీలో 10 సార్లు ప్రసారమైన రేటింగ్ లో పెద్ద మార్పు ఏమి లేదని టెలివిజన్ వర్గాల వారు వెల్లడిస్తున్నారు. ఆ సినిమాపై ఇంకా మోజు తగ్గలేదని వారు వివరించారు. బాహుబలి కంక్లూజన్ వచ్చేవరకు ఆ క్రేజ్ అలాగే ఉంటుందని భావిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=QASELDSpQD8

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus