బాహుబలి 2 చెంత వాలిన మరో రికార్డ్!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమోళి తెరకెక్కించిన అద్భుత కళాఖండం బాహుబలి కంక్లూజన్ మొన్నటి వరకు కలక్షన్ల వర్షం కురిపించింది. ఇక అవార్డుల జోరు అందుకుంది. ఏ చోట అడుగు పెట్టినా.. ఏ విభాగంలో చూసిన రికార్డుల మోత మోగిస్తోంది. కొన్ని రోజుల క్రితం “స్టార్ మా”లో ప్రసారమైన బాహుబలి 2 22.7 TVR సాధించి..  తెలుగు  టెలివిజన్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక  టెలివిజన్ వీవర్స్ రేటింగ్ (టీవీఆర్)  అందుకుంది.  వెండితెరపైనే కాకుండా బుల్లితెరలోను బాహుబలి కంక్లూజన్ తన సత్తాని చాటింది.  అంతేకాదు నెట్ ఇంట్లోనూ విజయ డంఖా మోగించింది.

2017లో గూగుల్‌ ప్లేలో అత్యధికంగా వీక్షించిన పాటగా “సాహోరే బాహుబలి” రికార్డుకెక్కింది.  గేమ్‌ విభాగంలో స్థానికంగా రూపొందించిన ‘బాహుబలి: ది గేమ్‌’ టాప్‌ లో నిలిచింది. అంతర్జాతీయ గేమ్‌లైన “డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్స్‌”, “సూపర్‌ మ్యారియో రన్‌”, “పోకెమాన్‌ డ్యుయల్‌” గేమ్‌లను దాటి బాహుబలి టాప్‌ స్థానంలో ఉండడం విశేషం. ఈ విషయాన్ని గూగుల్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. బాహుబలి తర్వాత రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ తో సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. బాహుబలి హీరో మాత్రం యాక్షన్ థ్రిల్లర్ సాహో షూటింగ్ లో ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus