దేశవ్యాప్తంగా బాహుబలి ఫీవర్ ఉంది. ఓ వైపు రోజురోజుకి ఎండలు పెరుగుతుంటే, అంతకంటే ఎక్కువగా కంక్లూజన్ ని చూడాలనే ఆత్రుత కూడా పెరుగుతోంది. మరో వారం రోజుల్లో థియేటర్లో సందడి చేయనున్న బాహుబలి 2 గురించి వీక్లి మ్యాగజైన్ ఇండియా టుడే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. భారతీయ చలచిత్ర చరిత్రని తిరగరాసే మూవీ ఇది అని కీర్తిస్తూ ఈ వారం కవర్ పేజీపై బాహుబలి కంక్లూజన్ పోస్టర్ ని ప్రచురించింది. దీంతో ఈ సినిమా గురించి మాట్లాడుకునేవారు సంఖ్య పెరిగింది.
ఒక తెలుగు సినిమా గురించి భారతీయులందరూ చదివేవిధంగా కవర్ పేజీపై ప్రచురించడం మ్యాగజైన్ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం. తెలుగు సినిమాలకు దక్కిన అరుదైన గౌరవం ఇది. 450 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఆరు భాషల్లో ఏడువేల థియేటర్లో రిలీజ్ కానుంది. ప్రభాస్, రానా పోటా పోటీగా నటించిన ఈ మూవీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.