Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

‘బాహుబలి’ తో తెలుగు సినిమా స్టాటిస్టిక్స్ ని, డైనమిక్స్ ని మార్చేశారు రాజమౌళి. లాంగ్వేజ్ బారియర్స్ అనేవి లేకుండా తుడిచేశారు. తెలుగు సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ‘బాహుబలి’ కి ముందు ‘బాహుబలి’ కి తర్వాత అనేలా మార్చేశారు. ఇండియన్ సినిమాల్లో తొలి వెయ్యి కోట్ల సినిమా అంటే ‘బాహుబలి 2’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి అంటే.. దానికి కారణం కూడా ‘బాహుబలి’నే..! అలాంటి ‘బాహుబలి’ ని రీ రిలీజ్ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Baahubali-The Epic Collections

కాకపోతే ఆడియన్స్ కి ఓ కొత్త ఫీల్ అందించాలి అనే ఉద్దేశం మేరకు ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ సినిమాలను కలిపేసి ‘బాహుబలి – ది ఎపిక్’ గా అక్టోబర్ 31న రీ రిలీజ్ చేశారు. ప్రేక్షకుల డిమాండ్ మేరకు దీనికి కూడా ప్రీమియర్స్ చేశారు. ఓపెనింగ్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి.విచిత్రం ఏంటంటే 2వ రోజు కూడా కుమ్మేసింది అని చెప్పాలి.

ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 5.9 cr
సీడెడ్ 1.42 cr
ఆంధ్ర(టోటల్) 3.75 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 11.07 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.95 cr
ఓవర్సీస్ 10 cr
మిగిలిన వెర్షన్లు 5.7 cr
టోటల్ వరల్డ్ వైడ్ 31.72 కోట్లు (గ్రాస్)

‘బాహుబలి – ది ఎపిక్’ సినిమా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.31.72 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అన్ని భాషల్లో ఉన్న ప్రేక్షకులందరూ ‘బాహుబలి’ ని మరోసారి బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓ రీ- రిలీజ్ సినిమా 2వ రోజు కూడా ఈ రేంజ్లో కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.

మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘మాస్ జాతర’

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus