ఏనుగు కుంభస్థలం పై ఒక కాలు పెట్టి ఎక్కుతున్న బాహుబలి మోషన్ పోస్టర్ చూసినప్పుడు ఎవరూ అంచనా వేయలేక పోయారు… బాహుబలి కంక్లూజన్ రికార్డుల కుంభస్థలాన్నే కొడుతుందని!, ఇప్పుడే అదే జరిగింది. ఎస్.ఎస్. రాజమౌళి ఊహించిన దానికంటే బాహుబలి 2 ట్రైలర్ ఎక్కువ వ్యూస్ అందుకుంది. గురువారం ఉదయం విడుదలయిన ఈ వీడియో 24 గంటలు తిరగక ముందే ఒక తెలుగు వెర్షన్ కి మాత్రమే రెండు కోట్ల ఇరవై లక్షల వ్యూస్ వచ్చాయి. టాలీవుడ్ లోనే కాదు, సౌత్ ఇండియాలోని ఏ సినిమా ట్రైలర్ కి ఇన్ని వ్యూస్ రాలేదు. ఇది ఒక రికార్డు కాగా, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లోని ట్రైలర్ ని ఒక రోజులో చూసిన వారి సంఖ్య 5 కోట్లు దాటి పోయింది.
బాలీవుడ్ సినిమా ట్రైలర్లు ఈ మార్క్ చేరుకోవడానికి పది రోజులు సమయం అయ్యేది. ఆ రికార్డును ఒక రోజులోనే ప్రభాస్ నెలకొల్పాడు. బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28 న థియేటర్లోకి రానుంది, అప్పటి లోపున ఇంకెన్ని యూట్యూబ్ రికార్డులు బద్దలు కానుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.