వామ్మో శ్రీముఖి పుల్లలు పెట్టడంలో నెంబర్ వన్..!

‘బిగ్ బాస్3’ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. గత నెల కాస్త నీరసంగా సాగిన ‘బిగ్ బాస్’… ఇప్పుడు క్యూరియాసిటీ పెంచేలా టాస్క్ లు ఇస్తున్నాడు. మొన్నటి వారం దెయ్యం టాస్క్ ను సరిగ్గా ఆడకుండా చెడగొట్టిన శ్రీముఖికి… హోస్ట్ నాగార్జున ఓ రేంజ్లో క్లాస్ పీకాడు. ‘కూసే గాడిద వచ్చి… మేసే గాడిదని చెడగొట్టినట్టు’ చేశావ్ అంటూ శ్రీముఖి పై నాగార్జున మండిపడ్డాడు. ఒక్క విషయం గమనిస్తే శ్రీముఖి మొదటి నుండీ ‘మైండ్ గేమ్’ ఆడుతున్నట్టు స్పష్టమవ్వక మానదు. అంతేకాదు ఒక రకంగా అందరి మధ్య పుల్లలు పెడుతుందనే చెప్పాలి. మొదట్లో హేమ, రాహుల్ ని టార్గెట్ చేసి హౌస్ నుండీ బయటకి పంపాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ రాహుల్ కు జనాదరణ పెరగడంతో.. ప్రతీసారి సేఫ్ అవుతూ వస్తున్నాడు. ఇది గమనించిన శ్రీముఖి తరువాత రోహిణి ని టార్గెట్ చేసింది. ఆమెను ఎమోషనల్ గా దెబ్బతీసిందనే చెప్పాలి.

ఇక అటుతరువాత రవి, మహేష్ లను కూడా ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇక బాబా భాస్కర్ కెప్టెన్ అయినప్పుడు.. నామినేషన్స్ ప్రక్రియలో.. నామినేట్ అయిన సభ్యులలో ఒకరిని సేఫ్ చేసే అధికారాన్ని ‘బిగ్ బాస్’ ఇచ్చాడు. ఆ సమయంలో రవిని సేఫ్ చేశాడు బాబా. ఇది మనసులో పెట్టుకుందో ఏమో కానీ ఇప్పుడు బాబా భాస్కర్ టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది బిగ్ బాస్. బాబా భాస్కర్ ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనతో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ‘శివ జ్యోతి(తీన్మార్ సావిత్రి) హౌస్ లో రిలేషన్స్ అంటూ నామినేషన్స్ నుండీ తప్పించుకుంటుందని’ చెప్పింది. దీంతో బాబా భాస్కర్ తొందరపడి శివ జ్యోతి దగ్గర నోరు జారాడు. వెంటనే ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. తరువాత బాబా భాస్కర్ వచ్చి సర్దిచెప్పేసరికి ఆమె కూల్ అయ్యింది. కానీ తరువాతి వారం నామినేషన్స్ ప్రక్రియలో శివ జ్యోతి.. బాబా భాస్కర్ ను నామినేట్ చేయడం పక్కా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమైనా పుల్లలు పెట్టడంలో శ్రీముఖి ‘పి.హెచ్.డి’ చేసింది అని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇలా నక్క తెలివితేటలు ఉపయోగించి ఆమె బిగ్ బాస్ టైటిల్ గెలుస్తుందో.. లేదో చూడాలి..!

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus