సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్న ఒకప్పటి టాలీవుడ్ హీరో.. పెద్ద షాక్ ఇది..!

సినీ పరిశ్రమకు చెందిన వారు రెండో పెళ్లి చేసుకోవడం పెద్ద విడ్డూరమైన విషయం కాదు.ఈ లిస్ట్ గురించి చెప్పుకోవాలి అంటే మనం చాలా మంది హీరో, హీరోల గురించి చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడు చెప్పుకోబోతున్న విషయంలో మాత్రం కొంత విడ్డూరం ఉంది.టాలీవుడ్ కు చెందిన ఈ నటుడు 60 ఏళ్లకు దగ్గరలో ఉన్నాడు. ఇతను రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయికి 25 ఏళ్ళు కూడా నిండలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒకప్పటి హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ అయిన బబ్లూ పృథ్వీ రాజ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘నాన్ వళవయ్యప్పన్’ అనే తమిళ సినిమాలో బబ్లూ అనే పేరుతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడితను.

1990, 2000 లలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన చాలా సినిమాల్లో ఇతను హీరోగా, సహాయ నటుడిగా, విలన్ గా నటించాడు. అయితే ‘పెళ్లి’ ‘పెళ్లి పందిరి’ ‘ప్రేయసి రావే’ ‘సమరసింహా రెడ్డి’ ‘దేవుళ్ళు’ ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘గౌతమ్ ఎస్.ఎస్.సి’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ కథనం’ వంటి సినిమాల్లో ఇతను నటించాడు. ఇప్పుడు పృథ్వీ వయసు 57 సంవత్సరాలు. అతనికి పెళ్ళై చాలా కాలం అయ్యింది. అతని భార్య పేరు బీనా. వారికి ఆహెద్ అనే కుమారుడున్నాడు.కారణాలేంటో తెలీదు కానీ ఇతను కొన్నాళ్లుగా తన భార్యకు దూరంగా నివసిస్తున్నాడట.

ఈ నేపథ్యంలో అతను మలేషియాకి చెందిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడట. ఆమె వయసు కేవలం 23 ఏళ్ళే కావడం గమనార్హం. ఈ విషయాన్ని అతను గోప్యంగా ఉంచాడని, త్వరలోనే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తాడని అతని స్నేహితులు చెప్పుకొచ్చారు.మరోపక్క పృథ్వీ కొడుకు అతను ఆటిజం వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ టాపిక్ వైరల్ గా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus