Gutta Jwala , Samantha: సమంతపై ఫైర్ అయిన గుత్తాజ్వాల.. అలా జరిగితే ఏం చేస్తారంటూ?

  • July 8, 2024 / 01:12 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత (Samantha) త్వరలో వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ కానున్నారు. మా ఇంటి బంగారం అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు. సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంత తాజాగా ఒక చిట్కాను సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే సమంత షేర్ చేసిన చిట్కా విషయంలో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇతరులకు సహాయం చేయాలనే మీ ఆలోచన మంచిదేనని కానీ జరగరానిది ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా అంటూ ఆమె ఫైర్ అయ్యారు. సమంత పేరు ప్రస్తావించకుండానే గుత్తా జ్వాల ఈ కామెంట్స్ చేశారు. జనాలకు ఆరోగ్య సూచనలు ఇచ్చే సెలబ్రిటీలను ఒకే ప్రశ్న అడగాలని అనుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మీరు సూచించిన చికిత్స వల్ల అవతలి వాళ్లు మరణిస్తే పరిస్థితి ఏంటని ఆమె పేర్కొన్నారు.

జరగరానిది ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? మీకు సలహా ఇచ్చిన డాక్టర్ బాధ్యత తీసుకుంటారా? అని కామెంట్లు చేశారు. గుత్తా జ్వాల పోస్ట్ విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమంత ఈ కామెంట్స్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. సమంత వివాదాలకు దూరంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సమంత కెరీర్ పరంగా బిజీ కావడంతో పాటు మరిన్ని విజయాలను అందుకుంటారేమో చూడాలి. సోషల్ మీడియాలో సమంతకు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సమంత లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లతో సైతం సత్తా చాటాలని అభిమానులు ఫీలవుతున్నారు. సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus