శివగామి ఎత్తిన బాహుబలి.. ఇప్పుడు UKG

  • January 28, 2021 / 08:09 PM IST

బాహుబలి సినిమాలో ప్రతి చిన్న సన్నివేశం కూడా ఆడియెన్స్ మనసులో ఒక చెరగని ముద్ర వేసుకుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్ బడ్జెట్ సినిమాలో నటించిన అగ్ర నటీనటుల కెరీర్ కూడా ఒక్కసారిగా ఆ సినిమాతోనే యూ టర్న్ తీసుకుంది. అయితే బాహుబలి మొదటి పార్ట్ లో అందరి మనసులో ఎక్కువగా గుర్తుండిపోయే సన్నివేశాల్లో శివగామి డెత్ సీన్ ఒకటి. శివగామి తన చేతిలో పసికందును ఎత్తి పట్టుకొని ఒక వాగులో మహేంద్ర బాహుబలి బ్రతకాలి అంటూ చెప్పిన డైలాగ్ కూడా ఎవరు మర్చిపోలేరు.

బాహుబలి 1 మొదటి పోస్టర్ కూడా అదే. అప్పట్లో ఆ పోస్టర్ చాలా వైరల్ అయ్యింది. ఇక అందులో కనిపించిన పసి బాలుడు ఎవరని అప్పట్లో అనేక రకాల ప్రశ్నలు గూగుల్ లో సెర్చ్ చేయబడ్డాయి. అయితే ఆ పసికందు బాలుడు కాదు. ఆ పాత్రలో కనిపించింది ఒక అమ్మాయి. ఆమె పేరు తన్వి. నెలల వయసులోనే వెండితెరపై కనిపించిన ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో ఫొటోలలో చూడవచ్చు. ఆమె స్కూల్ కు కూడా వెళుతోంది.

యూకేజీ చదువుతున్న తన్వి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె గురించి ఎవరైనా తెలుసుకుంటే మాత్రం వెంటనే సెల్ఫీలు అడిగేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఈ చిన్నారి వెండితెరపై కనిపిస్తుందో లేదో చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus