Balakrishna: టోపీ పెట్టుకొని చెప్పకపోతే కుదరదా!

రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులందరికీ మన సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా విషెస్ చెబుతూ ఫేస్ బుక్ లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ రంజాన్ అందరి జీవితాలలో సుఖ సంతోషాలు తీసుకురావాలంటూ క్యాప్షన్ ఇచ్చి వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో బాలయ్య ముస్లింలు తలపై ధరించే టాకియాతో కనిపించారు. ముందుగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన బాలయ్య..

త్యాగానికి, సేవానిరతికి మారు పేరు రంజాన్ పవిత్ర మాసమని అన్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయమని అన్నారు. అల్లా కృపాకటాక్షాలతో ఈ రంజాన్‌ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని.. అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడవరకు బాగానే ఉంది కానీ.. బాలయ్య ముస్లిం టోపీ పెట్టుకొని విషెస్ చెప్పడం కొందరికి రుచించడం లేదు.

”టోపి పెట్టుకుని చెప్పకపోతే కుదరదా సార్. వాళ్లు ఎవరైనా.. ఎప్పుడైనా మన పండుగలకు బొట్టు పెట్టుకుని పంచె కట్టుకుని శుభాకాంక్షలు చెప్పారా..” అంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ బాలయ్య అభిమానులు మాత్రం ‘మీరు రియల్ హీరో’ అని పొగుడుతూ వీడియోను వైరల్ చేస్తున్నారు.


Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus