టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ నటించిన అఖండ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా అయిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దసరాకు అఖండ మూవీ రిలీజ్ కావడం లేదని ఇప్పటికే క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కానుందని తెలుస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.
రెండు పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానుంది. దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించినా షూటింగ్ లేట్ కావడంతో కుదరలేదని సమాచారం. డిసెంబర్ లో పుష్ప సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో బాలయ్య నవంబర్ లో తన సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అఖండకు ఏ సినిమా నుంచి పోటీ లేనట్టేనని సమాచారం.
రజినీకాంత్ నటించిన అన్నాత్తే దీపావళికే రిలీజ్ కానున్నా ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరగగా చిత్ర బృందం అతి త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటించాలని భావిస్తోంది. అఖండ 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండగా నిజంగా ఈ సినిమా ఆ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో లేదో చూడాలి.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!