బాలయ్య (Balakrishna) బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ2 (Ahanda) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఈ నెల 16వ తేదీని మూహూర్తంగా ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) హీరోగా తెరకెక్కనున్న సినిమాకు సైతం తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన సినిమాలకు కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సైతం సహ నిర్మాతగా వ్యవహరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బాలయ్య (Balakrishna) కూతురిని నిర్మాణ రంగంలో ప్రోత్సహిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య నిర్మాతగా సక్సెస్ కావడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులను నిర్మాతలుగా సక్సెస్ చేయడంలో అటు బాలయ్య ఇటు ఎన్టీఆర్ రాజీ పడటం లేదు. ఈ విషయంలో బాలయ్య, ఎన్టీఆర్ లను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. బాలయ్య, ఎన్టీఆర్ కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నా ఈ కాంబో ఇప్పట్లో సాధ్యం కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అటు బాలయ్య ఇటు ఎన్టీఆర్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఈ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ షూట్ త్వరలో మొదలుకానుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. ఎన్టీఆర్ వార్2 సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నందమూరి హీరోలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు.
బాలయ్య బాబీ (Bobby) మూవీ టైటిల్ టీజర్ దీపావళి పండుగ కానుకగా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. బాలయ్య సైతం పారితోషికాన్ని 35 కోట్ల రూపాయలకు పెంచేశారనే సంగతి తెలిసిందే. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మాస్, యాక్షన్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలయ్య కెరీర్ ప్లాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండగా సినిమా సినిమాకు లుక్ విషయంలో బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు.