Balakrishna: సామాన్యులను మాత్రమే కాదు హీరోలను కూడా బాలయ్య వదిలిపెట్టలేదట…!

నందమూరి బాలకృష్ణ ఎంతటి స్టార్ హీరోనో… ఎంతటి గొప్ప ఫ్యామిలీ నుండీ వచ్చిన వ్యక్తో ప్రత్యేకంగా చెప్పవసరంలేదు. కానీ కొన్ని కొన్ని సార్లు ఆయన చేసే పనులు, మాట్లాడే మాటలు ఆయన స్థాయికి తగినవి కానట్టే ఉంటాయి. గతంలో అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టేయాలి లేదా కడుపైనా చేసెయ్యాలి అంటూ సావిత్రి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఆయన పలికిన మాట ఎన్నో వివాదాలకు తెరలేపింది. ఇక అభిమానులను చీటికి మాటికి కొట్టడం… వాటిని వాళ్ళు కవర్ చెయ్యడం కొత్తేమీ కాదు.

సినిమా షూటింగ్ టైం లో కూడా యూనిట్ మెంబెర్స్ పై బాలయ్య చేయిచేసుకున్న సందర్భాలను కూడా మనం చూశాం. నా అభిమానులను నేను కొడుతుంటే వాళ్ళు ఆనందంగా ఫీలవుతారు, నన్ను తాకాడు రా అని చెప్పుకుంటూ సంబరపడిపోతారు అంటూ బాలయ్యే ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. సామాన్యులను మాత్రమే కాదు ఓ స్టార్ హీరో పై కూడా బాలయ్య చెయ్యి చేసుకున్నాడట. ఆ స్టార్ హీరో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లో ఎదిగిన వ్యక్తి. లైట్ మెన్ గా కెరీర్ ను ప్రారంభించి తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా , జూనియర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు.

అతనికి మాస్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. అతను ఓ హీరోయిన్ దగ్గర బాలయ్య ఏజ్ గురించి కామెంట్ చేశాడట. ఆ హీరోయిన్ వెళ్లి బాలయ్య దగ్గర చెప్పింది. దాంతో ఓ రోజు ఆ హీరోని ఇంటికి రమ్మని పిలిచి మరీ బాలయ్య కొట్టాడట. అయితే ఆ స్టార్ హీరో తమ్ముళ్లను ఓ సారి పోలీసులు అరెస్ట్ చేస్తే బాలయ్యే తన సర్కిల్ ను ఉపయోగించి రిలీజ్ చేయించాడట. అయితే దీనిని బట్టి బాలయ్య కోపానికి ఓ మీనింగ్ ఉంటుందని స్పష్టమవుతుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus