BalaKrishna: అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న ‘అఖండ’ టీజర్..!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ చిత్రాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. దాంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. ఉగాది రోజున ఈ చిత్రం టైటిల్ ను ‘అఖండ’ గా ప్రకటించి ఓ టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ టీజ‌ర్‌లో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నాడు. ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది… కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది…’ అంటూ బాలయ్య చెప్పే డైలాగులు కూడా హైలెట్ గా నిలిచాయి. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ‘ద్వారక‌ క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక టీజర్ ప్రస్తుతం యూట్యూబ్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి నెలకొల్పిన రికార్డుని బాలయ్య ‘అఖండ’ టీజర్ తో బ్రేక్ చెయ్యడం విశేషం.

ఇప్పటి వరకూ ‘అఖండ’ టీజర్ 28 మిలియన్ల వ్యూస్ ను అలాగే 370K లైక్స్ ను సాధించింది.గతంలో ఈ రికార్డు చిరంజీవి ‘సైరా’ పేరు పై ఉంది. ఒకసారి సీనియర్ స్టార్ హీరోల టీజర్ల(వ్యూస్) రికార్డులను పరిశీలిస్తే :

1) ‘కబాలి'( రజినీ కాంత్) టీజర్ : 37 మిలియన్ వ్యూస్

2)’కాలా’ (రజినీ కాంత్) టీజర్: 32 మిలియన్ వ్యూస్

3)’అఖండ’ టీజర్ : 28 మిలియన్ వ్యూస్ ( 7 రోజుల్లోనే)

4)’2.0′ : 37 మిలియన్ వ్యూస్

5)’సైరా’ : 22 మిలియన్ వ్యూస్

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus