Balakrishna: బాబీ సినిమాకు సంబంధించి బాలయ్యకు ఫ్యాన్స్ రిక్వెస్ట్ ఇదే!

  • September 25, 2024 / 10:08 AM IST

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) (Balakrishna) కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉండగా బాలయ్య బాబీ (Bobby)  కాంబో మూవీపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నా అధికారికంగా ఇందుకు సంబంధించి స్పష్టత లేదనే సంగతి తెలిసిందే. 2025 జనవరి 12న ఈ సినిమా రిలీజవుతుందని కొన్ని కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. వాస్తవానికి జనవరి 12వ తేదీ ఆదివారం కావడంతో ఈ సినిమా ఆ తేదీకి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు.

Balakrishna

బాలయ్య బాబీ కాంబో మూవీ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటన ఆలస్యమైతే ఇతర సినిమాల డేట్లతో క్లాష్ అయ్యే అవకాశం ఉంటుంది. దసరా పండుగ సమయంలోనైనా టైటిల్, రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వస్తుందేమో చూడాల్సి ఉంది. జనవరి 9వ తేదీ ఈ సినిమాకు బెస్ట్ డేట్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిలీజ్ డేట్ విషయంలో ఆలస్యం చేసి బాలయ్య తప్పు చేయవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బాలయ్య బాబీ కాంబో మూవీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య బాబీ కాంబో మూవీ బడ్జెట్ ఏకంగా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది. బాబీ గత సినిమా వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

బాలయ్య యాక్షన్ కథలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కూడా సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు బాలయ్య ఖాతాలో చేరడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus