కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) సినిమాలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ‘ఆవారా’ (Awara) ‘ఖైదీ’ (Kaithi) ‘సర్దార్’ (Sardar) వంటి సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే గత ఏడాది వచ్చిన ‘జపాన్’ (Japan) నిరాశపరిచింది. ఇక ఈ సెప్టెంబర్ 28 కి ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కార్తీ. తమిళ 96 వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన సి ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) అదే చిత్రాన్ని ‘జాను’ గా తెలుగు ప్రేక్షకులకు అందించాడు.
ఎందుకో ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించలేదు. ఇప్పుడు కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ కి కూడా అతనే దర్శకుడు. ఇది డబ్బింగ్ కాబట్టి.. తెలుగు ప్రేక్షకులకి నచ్చే ఛాన్స్ ఉంది.సూర్య (Suriya) -జ్యోతిక (Jyothika) ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తీతో పాటు అరవింద్ స్వామి (Arvind Swamy) కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించాడు. అతను కార్తీకి బావమరిది పాత్రలో నటించాడు. ఇక ఈ చిత్రం చూసిన తెలుగు బయ్యర్స్ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
వారి టాక్ ప్రకారం.. కార్తీ – అరవింద్ స్వామి..లు బావ బావమర్థులుగా ఈ చిత్రంలో నటిస్తారట. ’96’ మాదిరే ఇది కూడా ఎక్కువ శాతం నైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన మూవీ అని అంటున్నారు. ఎక్కువగా వీళ్ళే కనిపిస్తారట. ఇక శ్రీ దివ్య (Sri Divya), స్వాతి కొండే, దేవదర్శిని వంటి వారు కూడా ఈ సినిమాలో నటించినప్పటికీ వారి పాత్రలు ఎక్కువ సేపు కనిపించవట. అయితే కార్తీ – అరవింద్ స్వామి..ల బ్రోమాన్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు.
ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వచ్చాయని అంటున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. అదేంటో థియేటర్లోనే చూడాలి. మొత్తంగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని వాళ్ళు చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ ‘దేవర’ వంటి పెద్ద సినిమా ముందు.. ఈ డబ్బింగ్ సినిమా ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.